పవన్ ఫ్యాన్స్ అస్సలు ఫీలవ్వట్లేదు

2 months ago 3
ARTICLE AD

పవన్ కళ్యాణ్ నటించిన OG  చిత్ర బెన్ఫిట్ షోస్ కి 1000 రూపాయలు టికెట్ ప్రైస్ కి అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చెయ్యడమే కాదు సింగిల్ స్క్రీన్స్, మల్టిప్లెక్స్ ల్లో OG టికెట్ రేట్స్ పెంచుకునేందుకు కూడా అనుమతి ఇవ్వడంతో చాలామంది OG మూవీ బెన్ఫిట్ షో కోసం వెళితే 1000 బొక్క, పవన్ సినిమా కోసం జేబులకు చిల్లు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం.. మాకు లేని ప్రాబ్లెమ్ మీకేమిటి, పవన్ సినిమాకి 1000 కాదు 2000 అయినా భయపడం అంటూ  మాట్లాడుతున్నారు. మా పవన్ సినిమాకి మేము డబ్బులిచ్చినా అవి మళ్ళీ మంచి వాళ్ళకే వస్తాయి, పేదరికంలో, సమస్యల్లో ఉన్నవాళ్ళకి జనసేనాని దానం చేస్తారు అంటూ పవన్ ఫ్యాన్స్ OG బెన్ఫిట్ షో 1000 రూపాయల టికెట్ రేట్ల విమర్శకులకు కౌంటర్లు వేస్తున్నారు. 

మరి OG సెప్టెంబర్ 25 తెల్లవారుఝామున 1 గంటకు ఎలాంటి విధ్వంశాన్ని సృష్టించేందుకు పవన్ ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు, ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ కోసం ఎంతెలా ప్లాన్ చేస్తున్నారో మరొక్క వారంలో క్లారిటీ వస్తుంది. 

Read Entire Article