Podharillu Serial Today Episode: అందమైన ఓ ఇల్లు...ఆ ఇంటిఇల్లాలు ఉన్నాళ్లు ఆ ఇల్లు కళకళలాడుతూనే ఉండేది. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇంటి యజమాని నారాయణ తాగుడుకు బానిసవ్వడంతో...ఇంటి పెద్దకొడుకు మాధవ్‌ చిన్న తమ్ముడికి తల్లయ్యాడు. పాలు తాగించడం దగ్గర నుంచీ ఆన్నీ తానై చూసుకుంటున్నాడు. అలాగే మరో ఇద్దరు తమ్ముళ్లు చక్రి, కేశవ్‌లను బడికి బయలుదేరించడం అన్నీ మాధవే చూసుకుంటున్నాడు. చక్రి,కేశవ్‌కు క్యారేజీ కట్టాలంటూ చిన్న తమ్ముడిని తండ్రి వద్ద వదిలి వెళతాడు మాధవ్‌...తాగిన మత్తులో చిన్నారిని చూసుకోకుండా నారాయణ వదిలెయ్యడంతో ఆ బాలుడు నీటి తొట్టివద్దకు వెళ్లి అందులోపడబోగా....అప్పుడే మాధవ్‌ వచ్చి చూసి రక్షిస్తాడు. అందరూ కలిసి తండ్రిని తిట్టినా...అతను పట్టించుకోకుండా తాగుతూనే ఉంటాడు. తమ్ముళ్లిద్దరిని స్కూల్‌ నుంచి సాయంత్రం త్వరగా వస్తే తాయర్‌ అత్త ఇంట్లో గాయత్రి ఓణీల పంక్షన్‌ ఉందని వెళ్లాలని చెబుతాడు మాధవ్‌. ఆ ఫంక్షన్‌కు నేను చస్తే రానని ఖరాఖండిగా చెబుతాడు మాధవ్‌ వాళ్ల తండ్రి. ఇప్పటికే మనల్ని బంధువులు ఎవరూ పిలవడం లేదని...తాయారు అత్త మాత్రం ఎంతో ప్రేమగా పిలిస్తే ఎందుకు రావని నిలదీస్తాడు. మీ అత్త చాలా మాయలేడీ అని నేను చస్తే రానని మళ్లీ అంటాడు. ఏదో మతలబు లేకుంటే మనల్ని ఎందుకు పిలుస్తుందని అంటాడు. దీంతో చక్రి,కేశవ్ బడికి వెళ్లిపోతారు. గాయత్రి కోసమైనా ఆ ఫంక్షన్‌కు వెళ్తామని చెప్పి మాధవ్‌ లోపలికి వెళ్లిపోతాడు.

గాయత్రి వాళ్ల ఇంట్లో ఓణీల ఫంక్షన్ ఏర్పాట్లు చకచకా సాగుతుంటాయి. తాయారు మాత్రం చాలా కంగారుపడుతుంటుంది. అప్పు తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లిన భర్త ఉత్త చేతులతో రావడంతో అతనిపై మండిపడుతుంది. ఇప్పుడు ఫంక్షన్ ఎలా చేయాలని భర్తపై మండిపడుతుంది. భార్యభర్తలిద్దరూ గొడవపడుతుంటే..వాళ్ల అన్నయ్య వచ్చి నేను సర్దుబాటు చేస్తాలే అని చెప్పి సముదాయిస్తాడు. తమ్ముడు నారాయణ ఉంటున్న ఇంటి స్థలం కోట్ల విలువ చేస్తుందని. వాడిని ఎలాగైనా ఒప్పించి ఆ ఇంట్లో వాటా అడుగుదామని తాయరు వాళ్ల పెద్దన్నయ్య అంటాడు. ఆ రోజు ఆ పాత ఇల్లు ఎందుకు పనికిరాదని....మా నారాయణకి వదిలేశామని ఇప్పుడు అది కోట్లు విలువచేస్తుందని అనుకోలేదని తాయరు అంటుంది. వాడ్ని ఎలాగైనా ఒప్పిద్దామని...లేకుంటే బెదిరించి పత్రాలపై సంతకాలు పెట్టించుకుందామని తాయరు వాళ్ల అన్నయ్య అంటాడు. సాయంత్రం ఫంక్షన్‌కు వస్తాడు కదా...వాడి చేత ఎలా సంతకాలు పెట్టించుకోవాలో నాకు తెలుసని...నువ్వు వెళ్లి పత్రాలు రెడీ చేయించి తీసుకురమ్మని తాయరు వాళ్ల అన్నయ్యను పురమాయిస్తుంది.

నారాయణ పిల్లలను తీసుకుని తాయరు వాళ్ల ఇంటికి వస్తాడు. మేనకోడల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆతర్వాత తాయరు,వాళ్ల భర్త కలిసి మందు తాగించడానికి నారాయణను తీసుకెళ్తారు. అక్కడ అప్పటికే వాళ్ల పెద్ద అన్న మందు తాగుతూ ఉండటాన్ని చూసి నారాయణ చిందులేస్తాడు.ఇలాంటి వెధవలతో కలిసి నేను మందు తాగనని అంటాడు. దీంతో బావమరిది నారాయణను సముదాయిస్తాడు. ఆయన మీ తోడబుట్టిన అన్నే కదా అని అంటాడు. తాయరు కూడా చెప్పడంతో నారాయణ మందు తాగడానికి ఒప్పుకుంటాడు. అటు మాధవ్‌ గాయత్రికి ప్రేమతో బంగారం ఉంగరం గిప్ట్‌గా ఇస్తాడు.ఈ ఉంగరం మాఅమ్మదని చెబుతాడు. ఇంతలో నారాయణ మందులో ఉండగా...ఇంట్లోవాటా రాసి ఇవ్వాలని తాయరు అడుగుతుంది. దాంతో గాయత్రి పెళ్లి చేస్తామని అంటుంది. దీంతో నారాయణ వాళ్లందరిపై మండిపడతాడు...మీరంతా కలిసి ఇన్నాళ్లకు ఇంత ప్రేమగా పిలిచినప్పుడే అనుమానం వచ్చిందంటాడు. నాన్న మీకు ఇచ్చిన వాటాలన్నీ అమ్ముకుని ఇప్పుడు నా ఇంటిపై పడ్డారా అంటూ మండిపడతాడు. నా ఇల్లు నా తర్వాత నా కొడుకులకే చెందుతుందంటాడు. నీకు గాయత్రి పెళ్లి చేయడానికి డబ్బు లేకుంటే...దాన్ని నా కోడలుగా చేసుకుంటాను తప్ప ఇంట్లో వాటా రాసిచ్చేది లేదని నారాయణ తేల్చిచెబుతాడు. చదువు, సంధ్య లేని నీ కొడుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందా అని తాయరు మండిపడుతుంది. ఇంతలో వాళ్ల పెద్దన్నయ్య కూడా కలుగజేసుకుని ఆ ఇల్లు నీ పేరిట ఉన్నట్లు ఏమైనా పత్రాలు ఉన్నాయా అని నిలదీస్తాడు. తాతాల ఆస్తి కాబట్టి అందరికీ హక్కు ఉందని అంటాడు. ఆ ఇంట్లో మాకు వాటా ఇస్తున్నట్లు పత్రాలపై సంతకాలు పెట్టాలని బెదిరిస్తారు. నారాయణ ఆ పత్రాలను చించిపడేస్తాడు. కోర్టుకు వెళ్తామని బెదిరించినా వెనక్కి తగ్గకుండా బయటకు వెళ్తాడు. అప్పుడే పిల్లలందరూ భోజనాలపై కూర్చుని ఉండగా...వాళ్లని అక్కడి నుంచి లేపి తీసుకెళ్తాడు.

దీంతో అన్న,చెల్లి ఇద్దరూ కలిసి నారాయణ ఇంట్లో వాటా ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్తారు. ఆ ఆస్తి తన వాటాగా వచ్చిందని నారాయణ నిరూపించుకోవాలని...అప్పటి వరకు దాన్ని అమ్మడం చేయరాదంటూ కోర్టు తీర్పు ఇస్తుంది. ఇంటిని అద్దెకు ఇవ్వడం గానీ, మరమ్మతులు చేయడం గానీ చేయరాదని చెబుతుంది. ఆ కోర్టు ఆర్డర్‌ తీసుకుని వారు మళ్లీ నారాయణ వద్దకు వచ్చి వాటా కోరతారు. కట్టుకున్న భార్యను చంపి జైలుకు వెళ్లి వచ్చావని తాయరు మొగుడు అనడంతో కోపంతో రగిలిపోయిన నారాయణ..అతన్ని చితకబాదుతాడు. దీంతో తాయరు అతన్ని శపిస్తుంది.నీఇంటికి ఏ ఆడపిల్ల రాదని....నీ బిడ్డలకు పెళ్లిళ్లు కావని శాపనార్థాలు పెడుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి...పిల్లలంతా పెద్దవాళ్లు అవుతారు.

రెండోవాడు చక్రి మాత్రం పెళ్లికోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. వాళ్ల అత్త పెట్టిన శాపంతో వాళ్లకు పెళ్లిళ్లు అవ్వడం లేదని బాధపడుతూ ఉంటాడు. ఈలోగా మాధవ్‌కు పెళ్లిచూపులు జరుగుతుండటంతో తమ్ముళ్లిద్దరూ హడావుడి చేస్తుంటారు. మహాలక్ష్మీ పెళ్లి గ్రాండ్‌గా చేయడానికి ఆమె తల్లిదండ్రులు,అన్నయ్య ఏర్పాట్లు చేస్తుంటే...నాకు ఇప్పుడే పెళ్లి వద్దని మహా లక్ష్మీ చెప్పడంతో ఈరోజు ఏపీసోడ్‌ ముగిసిపోతుంది.