ధ‌నికుల పెళ్లిలో కంగ‌న‌ డ్యాన్సులు

1 hour ago 1
ARTICLE AD

అయిన దానికి కానిదానికి ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డే కంగ‌న ర‌నౌత్ ధ‌నికుల‌ పెళ్లిళ్ల‌లో డ్యాన్సులు చేయ‌డానికి పూర్తి వ్య‌తిరేకి. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన జిందాల్ పెళ్లిలో డ్యాన్సులాడింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే....

పారిశ్రామిక వేత్త కం కాంగ్రెస్ నాయ‌కుడు నవీన్ జిందాల్ కుమార్తె వివాహంలో న‌టి కం భాజపా నాయ‌కురాలు కంగనా రనౌత్, మహువా మొయిత్రా, సుప్రియా సులే నృత్యం చేశారు. అయితే త‌న స‌హ‌చ‌రుల కంటే కంగ‌న ఈ పెళ్లిలో ఎక్కువ‌గా హైలైట్ అయింది. రాజకీయ విభేదాలను మరచిపోయి, పారిశ్రామికవేత్త-రాజకీయ నాయకుడు నవీన్ జిందాల్ కుమార్తె యశస్విని జిందాల్ వివాహ వేడుకల్లో బిజెపి ఎంపి కంగనా రనౌత్, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా, ఎన్‌సిపికి చెందిన సుప్రియా సులే వేదికపై సంద‌డి డ్యాన్సులు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సంగీత్ కార్య‌క్ర‌మంలో వీరంతా సినిమా పాట‌ల‌కు డ్యాన్స్ చేసారు. 2007లో విడుదలైన `ఓం శాంతి ఓం` నుండి  దీవాంగి దీవాంగికి నృత్యం చేస్తూ క‌నిపించారు. నవీన్ జిందాల్ కూడా వేదికపై వారితో క‌లిసి చాలా స్వేచ్ఛ‌గా డ్యాన్సులు చేసారు. అందుకు సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ గా మారాయి.

Read Entire Article