చింతమనేని పై సీఎం ఫైర్

9 months ago 8
ARTICLE AD

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నోటి దురుసు తెలియంది కాదు. ఆయన కి కోపం వచ్చింది అంటే తన మన అని చూడరు. యూత్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ చింతమనేని ప్రభాకర్‌. కానీ తన నోటి దురుసు వలన ఎప్పటికప్పుడు వివాదాలకు నెలవుగా మారుతున్నారు. అధికారం ఉన్నా, లేకపోయినా చింతమనేని ప్రభాకర్‌ ది ఒకటే తీరు. 

అందుకే సీఎం చంద్రబాబు కూడా చింతమనేని ప్రభాకర్‌ కు వార్నింగ్ ఇస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకో లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు. అసలు సీఎం చింతమనేని ప్రభాకర్‌ పై ఎందుకు ఫైర్ అయ్యారంటే.. గత బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్లిన చింతమనేని అక్కడ కార్ పార్కింగ్ దగ్గర వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో గొడవకు దిగారు. 

అబ్బయ్య చౌదరి కారును కావాలనే తన కారుకు అడ్డంగా పెట్టడంతో డ్రైవర్‌ను చింతమనేని విపరీతంగా తిట్టిపోశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది, దానితో చింతమనేని కి శుక్రవారం పార్టీ కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. చింతమనేని సీఎంను కలవగా... తప్పును తప్పని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, కేవలం బూతులు ఒక్కటే మార్గం కాదని, తీరు మార్చుకోవాలని, నోటి దురుసు తగ్గిచుకోవాలని చింతమనేనినిసీఎం  చంద్రబాబు హెచ్చరించారు. 

Read Entire Article