కిరణ్ రాయల్ వెనుక పవన్ కళ్యాణ్ - లక్ష్మి

9 months ago 8
ARTICLE AD

తన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేశాడంటూ తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే మహిళా చేసిన ఆరోపణలు ఎంతగా హాట్ టాపిక్ అయ్యాయో చూసారు. కిరణ్ రాయల్ మాత్రం అదంతా ఎవరో ఆడిస్తున్న నాటకం, తానెవరిని మోసం చెయ్యలేదు అవన్నీ మార్ఫింగ్ వీడియోస్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి కేసు పెట్టాడు. 

ఈలోపులో లక్ష్మి ని చెక్ బౌన్స్ కేసులో జైపూర్ పోలీసులు అరెస్ట్ చెయ్యగా, ఆమె ఒక్కరోజులోనే బెయిల్ పై విడుదలైంది. ఆమె బెయిల్ మీద బయటికొచ్చాకా మరోసారి కిరణ్ రాయల్ పై సంచలన కామెంట్స్ చేసింది. 

పవన్ కళ్యాణ్ గారు...నిజంగా కిరణ్ రాయల్ వెనుక మీరు ఉన్నారా

ఎవరి అండదండలు లేకుండా కిరణ్ ఇంత చేయలేడు 

చంద్రబాబును తిట్టినా, జగన్ ను తిట్టినా నన్ను పవన్ కళ్యాణ్ ఏం అనడు అని కిరణ్ నాతో చాలాసార్లు  చెప్పాడు

నాకు న్యాయం చేయండి అన్న అని మీకు దండం పెట్టి అడిగాను

మీరు నాకు సపోర్ట్ చేశారో లేదో తెలియదు కానీ ఎవరి సపోర్ట్  లేకుండా కిరణ్ మాత్రం ఇదంతా చేయడు

ఎంత మంది అమ్మాయిలను మోసం చేసినా నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో కిరణ్ రాయల్ ఉన్నాడు, నన్ను అరెస్టు చేయించి 40-50 రోజులు బయటికి రాకుండా చేయాలని, జైపూర్ పోలీసులకు ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసి, పెద్ద పెద్ద హోటల్స్ లో కిరణ్ రాయల్ వాళ్ళకి రూములు బుక్ చేశాడు

కానీ న్యాయస్థానం నా తప్పు లేదని గుర్తించి ఒక్క రోజులోనే బెయిల్ మంజూరు చేసింది. నా దగ్గర #PawannKalyan PEN DRIVE ఉంది. అందుకే నేను ఎవరిని తిట్టినా పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనడు అని కిరణ్ రాయల్ అన్నాడు అంటూ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి  సంచలన కామెంట్స్ చేసింది. 

Read Entire Article