Zubeen Garg Death: బాలీవుడ్ స్టార్ సింగర్ ప్రాణాలు తీసిన స్కూబా డైవింగ్ - 52 ఏళ్ల వయసులో రిస్క్ చేశారా?

2 months ago 3
ARTICLE AD
<p>Assamese Singer Zubeen Garg Dies in Scuba Diving: బాలీవుడ్ సంగీత ప్రపంచం షాక్&zwnj;కు గురయింది. &nbsp;ప్రసిద్ధ గాయకుడు, 'యా అలీ' హిట్ సాంగ్&zwnj;తో దేశవ్యాప్త ఫేమ్ పొందిన జుబీన్ గార్గ్ &nbsp; స్కూబా డైవింగ్ ప్రమాదంలో మరణించారు. సింగపూర్&zwnj;లో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్&zwnj;లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన, గురువారం స్కూబా డైవింగ్ చేస్తుండగా సముద్రంలోకి పడిపోయారు. &nbsp;సింగపూర్ పోలీసులు ఆయన్ను రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ &nbsp;తీవ్ర గాయాల కారణంగా డాక్టర్లు ఆయన్ను కాపాడలేకపోయారు. ఈ ఘటన అస్సాం, నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో &nbsp;సంచలనం సృష్టించింది. బాలీవుడ్ లోనూ చాలా పాటలు పాడారు.&nbsp;</p> <p>సింగపూర్ పోలీసు, మీడియా సోర్సుల ప్రకారం, జుబీన్ గార్గ్ గురువారం మధ్యాహ్నం స్కూబా డైవింగ్ యాక్టివిటీలో పాల్గొన్నారు. ఈ సమయంలో &nbsp;ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయారు. &nbsp;జుబీన్ సింగపూర్&zwnj;లో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్&zwnj;కు ప్రత్యేక ఆహ్వానంతో వెళ్లారు. &nbsp;సెప్టెంబర్ 20న ఆయన పెర్ఫార్మెన్స్ ఉండగా, ఈ ప్రమాదం జరిగింది. ఫెస్టివల్ ఆర్గనైజర్లు ఆయన మరణాన్ని ధృవీకరించి, కార్యక్రమాన్ని ఆపేశారు.</p> <p>రాక్&zwnj;స్టార్ ఆఫ్ నార్త్ ఈస్ట్ గా జుబెన్ గార్గ్ ప్రసిద్ధి చెందారు. &nbsp; 1972లో మెఘాలయలోని బాగ్&zwnj;హ్మారాలో &nbsp;జన్మించిన జుబీన్ బోర్థాకుర్&zwnj; తర్వాత &nbsp;జుబీన్ గార్గ్ గా ప్రసిద్ధి చెందారు. &nbsp;1990ల్లో అస్సాం &nbsp;మ్యూజిక్&zwnj;లో ఎంట్రీ ఇచ్చారు. తన గోత్రం 'గార్గ్'ను స్టేజ్ నేమ్&zwnj;గా &nbsp;మార్చేసుకున్నారు. అస్సామీ, బెంగాలీ, హిందీ సినిమాల్లో వేలాది పాటలు పాడారు. 2006లో 'గ్యాంగ్&zwnj;స్టర్' సినిమా 'యా అలీ' సాంగ్&zwnj;తో బాలీవుడ్&zwnj;లో బ్రేక్ దక్కింది. అస్సాం సినిమాల్లో గాయకుడిగా, కంపోజర్&zwnj;గా, యాక్టర్&zwnj;గా పనిచేసి, 'రాక్&zwnj;స్టార్ ఆఫ్ నార్త్ ఈస్ట్' అనే టైటిల్ సంపాదించారు.&nbsp;</p> <p>ఆయన మరణం అస్సాం మ్యూజిక్ ఇండస్ట్రీకి భారీ నష్టమని, ఆయన స్వరం శాశ్వతంగా మనసుల్లో ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. అస్సాం మంత్రి అశోక్ సింగల్ సోషల్ మీడియాలో, "జుబీన్ గార్గ్ మరణం అస్సామ్&zwnj;కు &nbsp; నష్టం. ఆయన స్వరం అమరం" అని నివాళి అర్పించారు.&nbsp;</p>
Read Entire Article