Surya Grahan & Navratri 2025: సూర్యగ్రహణం తర్వాత నవరాత్రులు! ఇది అశుభ సూచనా , ఈ అరుదైన కలయిక దేనికి హెచ్చరిక?

2 months ago 3
ARTICLE AD

Surya Grahan And Navratri 2025: సెప్టెంబర్ 21 భాద్రపద అమావాస్య ఆదివారం రోజు సూర్యగ్రహణం.  ఆదివారం రాత్రి సమయంలో ఏర్పడే సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే ఆ మర్నాడు ఆశ్వయుజం మాసం ప్రారంభమవుతోంది. ఈ రోజు నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి. అయితే నవరాత్రుల ప్రారంభానికి ముందు గ్రహణం రావడం మంచిదికాదా? ఇది దేనికి హెచ్చరిక? పురాణాల్లో ఏముంది?

గ్రహణం ఎప్పుడూ అడ్డంకులు శుద్ధి అవసరమయ్యే సమయంగా పరిగణిస్తారు. నవరాత్రి (Navratri) శక్తి జాగరణ పండుగ. అంటే ఈ అరుదైన కలయిక దేవిని ఆరాధించడం ద్వారా గ్రహణ దోషాలను తొలగించవచ్చని ... సమాజానికి ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని సూచిస్తుంది.

మనుస్మృతి  ధర్మసూత్రాల ప్రకారం..

సూర్యగ్రహణం అసుర శక్తుల ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో సూర్యునిపై నీడ పడటం రాజ్యం, సమాజం ...వ్యక్తి జీవితంలో అస్థిరతకు సంకేతంగా పరిగణిస్తారు. గ్రహణ సమయంలో శుభ కార్యాలు, వివాహాలు, ప్రయాణాలు లేదా కొత్త ఒప్పందాలు నిషేధిస్తారు. దీనిని దైవిక హెచ్చరికగా చూస్తారు.

నవరాత్రుల ప్రారంభం

దుర్గా సప్తశతి ప్రకారం దేవిని స్మరించేవారు ప్రతి సంక్షోభం నుంచి విముక్తి పొందుతారు. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా. గ్రహణం తర్వాత నవరాత్రులు ప్రారంభమైనప్పుడు...ఆ ప్రతికూల నీడ నుంచి విముక్తి పొందడానికి శక్తి ఆరాధన మాత్రమే మార్గమని ఇది సందేశం ఇస్తుంది.

శాస్త్రీయ రుజువు ఇదే

భవిష్య పురాణం ప్రకారం... గ్రహణం విఘ్నకారకం

తతః పశ్చాత్ శుద్ధ్యర్థం పూజా...

అంటే గ్రహణం అడ్డంకిని సూచిస్తుంది కానీ దాని తర్వాత పూజలు , ఉపవాసాలు దోషాలను తొలగిస్తాయి. అందుకే ఈసారి నవరాత్రులు మరింత ప్రత్యేకమైనవి, ఎందుకంటే ఇవి నేరుగా గ్రహణం తర్వాత ప్రారంభమవుతున్నాయి.

రాజకీయాలపై ప్రభావం

సూర్యుడు అధికారం ...నాయకత్వానికి కారకుడు. దానిపై నీడ పడటం రాజకీయ అస్థిరత  వివాదాలకు సంకేతం.

ప్రపంచంపై ప్రభావం

గ్రహణం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు ...ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది.

సమాజంపై ప్రభావం

ప్రజలు మానసిక ఆందోళన ... అభద్రతా భావానికి గురవుతారు.

వ్యక్తిగత జీవితంపై ప్రభావం

గ్రహణం (Eclipse) నవరాత్రి (Shardiya Navratri) కలయిక వ్యక్తిని ఆత్మపరిశీలన చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది.

ఆరోగ్యం: కళ్ళు, గుండె , రక్తం సంబంధిత వ్యాధులున్నవారు జాగ్రత్తపడాలి

కెరీర్: తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు

కుటుంబం: నవరాత్రి సాధనతో కుటుంబంలో శాంతి  సానుకూలత ఉంటుంది.

2025 ప్రత్యేక కలయిక

సెప్టెంబర్ 21 రాత్రి 10:59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది...అర్థరాత్రి 12 దాటిన తర్వాత  1:11 గంటలవరకూ ఉంటుంది. అంటే అర్థరాత్రి 12 దాటితే సెప్టెంబర్ 22 అనే పరిగణిస్తారు. ఇదే రోజు శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ కలయిక శాస్త్రాల్లో శక్తి పరీక్ష  -  సాధన సమయంగా చెబుతారు

పరిహారాలు

గ్రహణం సమయంలో నవగ్రహ శ్లోకాలు పఠించండి

అశుభ ఆలోచనలకు దూరంగా ఉండండి

నవరాత్రి స్థాపనకు ముందు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి

సూర్యగ్రహణం -  నవరాత్రుల కలయిక సాధారణ ఖగోళ సంఘటన కాదు కానీ శాస్త్రాల ప్రకారం ఇది హెచ్చరిక అంటారు పండితులు.  గ్రహణం ప్రతికూల శక్తుల సంకేతం కాబట్టి హెచ్చరిక... నవరాత్రి సాధన వాటిని తొలగించి జీవితంలో కొత్త శక్తిని తీసుకురాగలదు కాబట్టి అవకాశం. అందుకే ఈసారి నవరాత్రి కేవలం పండుగ మాత్రమే కాదు...ఆధ్యాత్మిక రక్షణ కవచం. భక్తి శ్రద్ధలతో ఆచరించండి అని పిలుపునిస్తున్నారు పండితులు.

గమనిక:  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Read Entire Article