Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ , ఇండియా కూటమి కారణమని చేస్తున్న ప్రచారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన తో ముడిపెట్టడం వల్లనే తాము అడ్డుకున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆ బిల్లును సవరించండి. కేవలం 33% మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక బిల్లును సోమవారం నాటికి తీసుకురండి, మేము వెంటనే మద్దతు ఇచ్చి పాస్ చేస్తాం అని కేంద్రానికి సవాల్ విసిరారు. మహిళా బిల్లు పేరుతో దక్షిణాది రాష్ట్రాల సీట్లను తగ్గించాలనే కుట్రను సహించబోమని తేల్చిచెప్పారు.

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాధాన్యతను కోల్పోతాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 30-50 ఏళ్లుగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు మాకు శిక్ష వేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, ఇతర దక్షిణాది నేతల ఆలోచనలు కూడా ఇదే దిశలో ఉన్నాయని, ప్రాంతీయ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇండియా కూటమి & కాంగ్రెస్ పార్టీ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ సూచన🔥#RevanthReddy pic.twitter.com/eY9R81lpVJ

— Kattar Congress (@kattarcongresii) April 18, 2026

జనాభా నియంత్రణ, దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి సమర్థించారు. చంద్రబాబు నాయుడు చాలా తెలివైన వారు, అపార అనుభవం గల నేత. ఆయన ఏదీ తప్పుగా చెప్పరు అని రేవంత్ ప్రశంసించారు. జనాభాను పెంచుకోవాలంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపు వెనుక పెద్ద వ్యూహం ఉందని, మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై ఆయన నేరుగా కాకపోయినా సంకేతాల ద్వారా తన నిరసనను తెలిపారని రేవంత్ విశ్లేషించారు సమజ్దార్ కో ఇషారా కాఫీ హై తెలివైన వారికి చిన్న సంకేతం చాలు అంటూ ఎన్డీయే మిత్రపక్షాల్లోనే అసంతృప్తి మొదలైందని రేవంత్ చెప్పుకొచ్చారు.

మోడీ ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..

- Revanth Reddy#BJP pic.twitter.com/4CfSR2uZOi

— Kattar Congress (@kattarcongresii) April 18, 2026

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అవమానించేలా తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టు మీద మేస్తుందా అని ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును తల్లిని చంపి బిడ్డను వేరు చేయడం తో పోల్చిన విషయాన్ని గుర్తు చేశారు. పెద్దలే అలా మాట్లాడినప్పుడు, కింద ఉన్న నేతలు అలాగే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా, ఓటింగ్ సమయంలో తలుపులు మూయడం అనేది ఒక ప్రాథమిక ప్రక్రియ అని, దానిని అవమానంగా చిత్రీకరించడం అజ్ఞానమేనని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి అటు బీజేపీపై పోరాటాన్ని, ఇటు చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని సమన్వయం చేసుకుంటూ, దక్షిణాది సెంటిమెంట్‌ను బలంగా వినిపించారు.