Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జూన్ 6న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వు రావొద్దు అక్కడే ఉండు..

లక్ష్మీ వేకువ జామున పూజ చేస్తుంటుంది. విహారి ఇంటి దగ్గర లక్ష్మీ కూతురు సిరి కూడా వేకువన పూజ చేసి తన తండ్రి తనతో ప్రేమగా ఉండేలా చూడమని కోరుకుంటుంది. ఇంట్లో అందరి దగ్గరకు పాప వెళ్లి హారతి ఇస్తుంది. పద్మాక్షి వచ్చి ఏంటే అప్పుడే స్నానాలు పూజలు అయిపోయాయా అని పాపని అడుగుతుంది. నువ్వు అక్కడే ఉండు రావొద్దు అని పాప హారతి తీసుకుంటుంది. విహారి రావడంతో నాన్న హారతి తీసుకోండి అని అంటుంది.

సిరి కోసం తీసుకోరా..

విహారి హారతి తీసుకోకుండా వెళ్లిపోతే యమున సిరి కోసం తీసుకోరా అని అంటుంది. విహారి తీసుకుంటుంది. పద్మాక్షి పాపతో మీ నాన్న కూడా స్నానం చేయలేదు కదా ఎందుకు హారతి ఇచ్చావ్ అని అంటే నాన్న చెప్పులు వేసుకోకుండా వచ్చాడు.. నువ్వు చెప్పులు వేసుకొని వచ్చావ్ అని అంటుంది.

నాకు నాన్న కావాలి..

హరికృష్ణ దేవుడికి దండం పెట్టుకొని స్వామి నాకు అమ్మ ఉంది.. నాన్న లేడు.. నాకు నాన్నని కలవాలి అని ఉంది.. నాకు ఒక్క సారి నాన్న కనిపించేలా చేయు తండ్రి అని వేడుకుంటాడు. లక్ష్మీ ఆ మాటలు విని కన్నీరు పెట్టుకుంటుంది. ఇక హరికృష్ణ దేవుడికి దండం పెట్టి జ్యూస్లు చేయడం మొదలు పెడతాడు. లక్ష్మీ ఏం తెలీనట్లు వచ్చి కొడుకుకి హారతి ఇస్తుంది. దేవుడి దగ్గరకు వెళ్లి సరైన సమయం వచ్చినప్పుడు హరికృష్ణని వాళ్ల నాన్న దగ్గరకు చేర్చుతా అని అనకుంటుంది.

కొడుకుని కాపాడిన విహారి..

హరికృష్ణ సెంటర్‌లో జ్యూస్‌లు అమ్ముతూ ఉంటే ఓ వ్యక్తికి 50 రూపాయలు తిరిగి ఇవ్వాలని పరుగులు పెడతాడు. ఇంతలో హరికృష్ణకి కారు ఢీ కొట్టబోతే విహారి వచ్చి కాపాడతాడు. సూపర్ మెన్ అని విహారిని హరికృష్ణ అంటాడు. ఆ వ్యక్తి వచ్చి 50 రూపాయలు తీసుకోమంటే పరుల సొమ్ము వద్దు అని అంటాడు. హరికృష్ణ మాటలకు విహారి చాలా ఇంప్రెస్ అవుతాడు.

లక్ష్మీ భర్తని చూస్తుందా..

లక్ష్మీ దగ్గరకు ఓ వ్యక్తి వెళ్లి మీ కొడుకుకి యాక్సిడెంట్ అవ్వాల్సింది అని చెప్తే లక్ష్మీ బాబు దగ్గరకు పరుగులు పెడుతుంది. విహారి హరికృష్ణ దగ్గరకు వెళ్లి మాట్లాడి ఇక్కడేం చేస్తున్నావ్ అని అంటే మా అమ్మ బీచ్‌కి అటు వైపు జ్యూస్‌లు అమ్ముతుంది.. నేను ఇక్కడ అమ్ముతా.. మా నాన్న ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు అని అంటాడు. విహారి బాబుని ఇంటికి వెళ్లిపోమని అంటే జ్యూస్‌లు అమ్మే వరకు వెళ్లను అంటాడు. దాంతో విహారి మొత్తం జ్యూస్‌లు కొనేస్తాడు. విహారి వెళ్లిపోయిన తర్వాత లక్ష్మీ బాబు దగ్గరకు వెళ్లి ఏం కాలేదు కదా అంటే నన్ను సూపర్ మెన్ కాపాడాడు అని హరికృష్ణ అంటాడు. ఎవర్రా అది అని లక్ష్మీ అంటే చూపిస్తా రామ్మా అని బాబు విహారి దగ్గరకు లక్ష్మీని తీసుకెళ్లే లోపు విహారి వెళ్లిపోతాడు. లక్ష్మీ తన బిజినెస్‌కి పోటీ వస్తుందని పగతో రగిలిపోతున్న మహిళకు లక్ష్మీ ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. దాని అంతు చూస్తా బయల్దేరుతుంది.

ఏమైంది నానీ..

సిరి పాప డల్‌గా ఉన్న యమున దగ్గరకు వెళ్లి ఏమైంది నానీ ఎందుకు అలా ఉన్నావ్ అని అడుగుతుంది. ఈ రోజు నాన్న పుట్టిన రోజు కదా.. నాన్న భర్త్‌డే రోజు ఎందుకు ఇలా డల్‌గా ఉన్నావ్ అని అడుగుతుంది. మీ నాన్న పుట్టిన రోజు చేసుకొని 5 ఏళ్లు అయింది అని బాధ పడుతుంది. నాన్న పుట్టిన రోజుని మనం చేద్దాం.. ఎలా అయినా నాన్న గుడికి వచ్చేలా చేద్దాం అని సిరి అంటుంది. నాన్న ఏం అనకుండా మనం జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం అని చెప్తుంది.

ఇంటికి తాళం వేసేసిన సిరి..

సిరి తండ్రిని గుడికి రప్పించాలి అని ఇంటికి తాళం వేస్తుంది. విహారి ఫైల్ కోసం ఇంటికి వచ్చి తాళం వేయడం చూసి పండుకి కాల్ చేస్తాడు. గుడిలో ఉన్నాం అని చెప్తే విహారి తాళం కోసం వస్తా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.