Prema Entha Madhuram Serial Today Episode: వర్కర్స్‌ అందరూ రాకేష్‌ దగ్గరకు వెళ్లి మీరు చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది కదా..? మళ్లీ మీరు ఫోన్‌ ఎత్తకుండా ఉండరు కదా..? అని అడుగుతారు. దీంతో ఏం జరగదని రాకేష్ చెప్పగానే.. ఏదైనా తేడా జరిగితే బాగుండదని వార్నింగ్‌ ఇస్తారు. దీంతో రాకేస్‌ భయంతో మాయకు ఫోన్‌ చేసి ఎలాగైనా ఆ ఫ్యాక్టరీ రీ ఓపెన్‌ అయ్యేట్టు చూడు అని చెప్తాడు. మాయ కంగారు పడుతుంది.

మాయ: ఏమైంది అన్నయ్యా..?

రాకేష్‌: వర్కర్స్‌ అందరూ ఇక్కడ నన్ను చుట్టు ముట్టారు. రేపు అగ్రిమెంట్‌ చేసుకుందామని ఫోర్స్‌ చేస్తున్నారు. నేను చెప్పిందంతా అబద్దం అని తెలిస్తే వీళ్లు కచ్చితంగా నన్ను చంపేస్తారు. అభయ్‌తో మాట్లాడి ఒప్పించి ఎలాగైనా కాంప్రమైజ్‌ చేయించు.

మాయ: సరే అన్నయ్యా నేను చూసుకుంటాను.

శంకర్‌: ఏంటో జెండే సార్‌ ఈ మధ్యన నా టంగ్‌కు పవర్‌ బాగా పెరిగిపోతుంది. ఇలా అనగానే అలా జరిగిపోతుంది. చూశారా రాకేష్‌ను అప్పుడే వర్కర్స్‌ చుట్టుముట్టేశారు.

జెండే: పాపం మాయకు పెద్ద టాస్క్‌ వచ్చింది శంకర్‌. తనకు టెన్షన్‌ ఎందుకులే ఆలోచించుకోని..

శంకర్‌: అంతేనంటారా..? మీ మాట ఎందుకు కాదంటాను సార్‌ రండి మనం అలా చల్లగాలిని ఆస్వాదిస్తూ.. టెర్రస్‌ పైన మాట్లాడుకుందాం. నువ్వు ఆలోచించుకో బాగా ఆలోచించుకో.. ఆల్‌ ది బెస్ట్‌. రండి జెండే సార్‌..

అంటూ జెండే, శంకర్‌ పైకి వెళ్లిపోతారు. తర్వాత డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఎవ్వరూ భోజనం చేయకుండా కూర్చుని ఉంటారు. అప్పుడే అక్కడికి జెండే, శంకర్‌ వస్తారు.

శంకర్‌: ఏంటి అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఎవరూ ఏమీ వడ్డించుకోలేదు.. ఏమైంది.

గౌరి: ఏమైందో ఏంటో మీకు తెలియదా..?

శంకర్‌: ఫ్యాక్టరీ ప్రాబ్లమ్‌ గురించా అది క్లోజ్‌ చేశాం. ఇంకా ప్రాబ్లమ్‌ ఏంటి..?

అకి: ఫ్యాక్టరీని క్లోజ్‌ చేస్తే అది ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయినట్టు కాదు కదా శంకర్‌ గారు.

అభయ్‌: చెప్పండి శంకర్‌ గారు ఫ్యాక్టరీ ఎందుకు క్లోజ్‌ చేయించారు.

పెద్దొడు: అన్నయ్యా నీ మనసులో ఏముందో చెప్పు. నిన్ను ఎవరూ ఏమీ అనుకోవద్దు.

చిన్నోడు: వర్దన్‌ ఫ్యామిలీ మీకు చాలా వ్యాల్యూ ఇస్తుంది.

శ్రావణి: శంకర్‌ గారు మీరు ఏం చేసినా రీజన్‌ ఉంటుంది. అదేంటో చెప్పండి.

అభయ్‌: ఏంటి శంకర్‌ గారే ఏంటి మీ స్ట్రాటజీ..

శంకర్‌: చెప్పాల్సింది నేను కాదు మాయ..

అని శంకర్‌ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. మాయ వైపు ఆశ్చర్యంగా చూస్తారు.

మాయ: నా పేరు చెప్తున్నాడేంటి..? ఏం ప్లాన్‌ చేశాడు. ( అని మనసులో అనుకుంటుంది.)

అభయ్‌: మాయా..?

శంకర్‌: అవును మీ అందరూ ఈ డిసిషన్‌ నాది అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నిజానికి నాకు ఈ ఐడియా ఇచ్చింది మాయానే..!

రవి: మాయ ఫ్యాక్టరీని ఎందుకు క్లోజ్‌ చేయమంది.

శంకర్‌: ఎందుకంటే ఫ్యాక్టరీలో గొడవలు రావడానికి కారణం రాకేషే కాబట్టి.

అకి: రాకేషా…?

శంకర్‌: అవును అకి.. అంతా ప్లాన్‌ ప్రకారమే జరిగిందని ఈ మాయకు తెలిసింది. మాయ నువ్వేం టెన్షన్‌ పడకు మీ అన్నయ్య ప్లాన్‌కు నీకు ఎలాంటి సంబంధం లేదు.

రవి: అంటే ఫ్యాక్టరీ విషయం ఇంత వరకు వస్తుందని తెలిసే ఇంత కుట్ర చేశారన్నమాట. ఎంత ద్రోహం. ( అని మనసులో అనుకుంటాడు.)

జెండే: వావ్‌ సూపర్‌ మాయ. వర్ధన్‌ ఫ్యామిలీ కోసం సొంత అన్నయ్యనే ప్రాబ్లంలో పడేసి ఎంత త్యాగం చేశావు.

శంకర్‌: ఇంత చేసి కూడా ఏమీ చేయనట్టు మౌనంగా ఉంది కదా అదీ సార్‌ ఆవిడ గొప్పదనం.

అని జెండే, శంకర్‌ కలిసి మాయను ఇరకాటంలో పడేస్తారు. మాయ అయోమయంగా చూస్తుంది. తర్వాత గౌరి, జెండే దగ్గరకు వెళ్లి ఫ్యాక్టరీని క్లోజ్‌ చేయాలన్న డిసిషన్‌ శంకర్‌ దే కదా సార్‌ మరి ఎందుకు మాయది అని చెప్పారు అని అడుగుతుంది. దీంతో జెండే మాయ, వర్దన్‌ కుటుంబం మీద పగతోనే ఈ ఇంట్లోకి అడుగుపెట్టిందని నిజం చెప్తాడు. దీంతో గౌరి షాక్‌ అవుతుంది. రవి గురించి చెప్తాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడని గౌరి అడిగితే మాయను అభయ్‌ లవ్‌ చేస్తున్నాడని అందుకే రవి, మాయను మార్చాలని శంకర్‌ ఇలా చేస్తున్నాడని జెండే చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!