Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవాతో నిన్ను ఎలా అయినా విడిపిస్తా అని అంటే దేవా మిథునను వదిలేసి వెళ్లిపోమని చెప్తాడు. మిథున దేవాతో నన్ను చూసి చెప్పు దేవా కన్నీరు దాచినంత తేలిక కాదు మనసులో ప్రేమ దాచుకోవడం అని అంటుంది. దాంతో దేవా మిథునని చూసి నా మనసులో నీ మీద ఎలాంటి ప్రేమ లేదు దయచేసి నన్నువదిలేసి వెళ్లిపో అని అంటాడు.

మిథున ఎమోషనల్ అవుతూ నువ్వు కట్టిన తాళి కోసం నేను ఎన్నో పోరాటాలు చేశాను.. కష్టమైనా నష్టమైనా నువ్వు నన్ను ప్రేమించినా ద్వేషించినా నేను నిన్ను వదలను దేవా.. నీతోనే ఉంటాను.. ఉండిపోతాను.. ఇప్పుడు నా ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి.. ఒకటి నిన్ను జైలు నుంచి బయటకు తీసుకురావడం అది ఈ రోజే చేసేస్తాను. రెండోది ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.. అప్పటి నుంచే నువ్వు ఇలా అయిపోయావ్ అదేంటో కచ్చితంగా తెలుసుకొని తీరుతానని మిథున అంటుంది. నీ జీవితం నాశనం చేసుకోవద్దు వెళ్లిపో అని దేవా అంటాడు.

మిథున ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం బయట నిల్చొని తల దించుకొని ఉంటారు. కాలనీ వాళ్లంతా నానా మాటలు అంటుంటారు. ఏమైందని మిథున అడిగితే దేవా చేసిన తప్పునకు ఆ నేత్ర ఇళ్లు వదిలి వెళ్లిపోయింది అని మనల్ని తిడుతున్నారని అంటుంది. కాలనీలోని ఒకామె చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న ఆడపిల్లని ఇబ్బంది పెట్టి వెళ్లిపోయేలా చేశారు మీకు ఉసురు తగులుతుంది అని దేవా ఫ్యామిలికీ శాపనార్థాలు పెడతారు. మాకు ఆడపిల్లలు ఉన్నారు మేం కూడా జాగ్రత్తగా ఉండాలి అను మాట్లాడుకోవడం మిథున విని చాలా బాధ పడుతుంది.

కాంతం దీర్ఘాలు తీస్తూ వాళ్లు మనకు అంత శాపనార్థాలు పెట్టారు. మనకు ఏం అవుతుందో ఏంటో.. అయినా ఎవరు ఇంట్లో కాలు పెట్టడం వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయో అని మిథున గురించి మాట్లాడుతుంది. రంగం భార్యతో అసలే చిరుత పులిలా ఫుల్ ఫైర్‌లో ఉంది లాగి పెట్టి కొట్టిందంటే 32 పళ్లు రాలిపోతాయ్ అంటాడు. సత్యమూర్తి కూలబడి 30 ఏళ్లగా ఇక్కడే ఉంటున్నా.. ఈ రోజు అందరూ ముఖాన ఉమ్మేసే పరిస్థితి వచ్చింది.. నేను పోతే అందరూ నా దగ్గరకు వస్తారు అనుకున్నా కానీ అనాథగా మిగిలిపోతాను అనుకోలేదు అని ఏడుస్తారు.

మిథున మామయ్యతో ఎవరు మన పరువు పోయేలా తిట్టారో వాళ్లే మనల్ని పొడిగేలా చేస్తా నా మీద నమ్మకం ఉంచండి మామయ్య అని అంటుంది. ఎస్‌ఐ దేవాని బయటకు తీసుకొచ్చి వీడిని కోర్టుకి తీసుకెళ్తున్నాం.. జన్మలో బయటకు రాకుండా కేసులు వేసి ఛార్జ్ షీట్ రెడీ చేయమని చెప్తాడు. దేవాతో ఎస్‌ఐ మిథున గురించి తప్పుగా మాట్లాడుతాడు. నువ్వు జైలులో ఉంటే నేను మిథునతో కులుకుతా అని దేవాతో అంటాడు.దేవా ఎస్‌ఐ కాలర్ పట్టుకొని నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అని బెదిరిస్తాడు. ఎస్‌ఐ కానిస్టేబుల్‌లో డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ మీద చేయి వేసుడు అని కేసు రాయమని అంటాడు. నేను మిథున మీద విరహంతో రగిలిపోతున్నా నిన్ను జైలులో ఉంచేసి బలవంతంగా అయినా మిథునని సొంతం చేసుకుంటా అని అంటాడు.
దేవా ఎస్‌ఐతో మిథున నా భార్య నేను ఎక్కడున్నా తనని ఓ సైనికుడిలా కాపాడుకుంటా.. నువ్వు నా భార్య జోలికి రాకుండా చేస్తా అని అంటాడు. మిథునని కాపాడుకోవడం కాదు ముందు బయటకు వచ్చేలా చూసుకోరా నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేరని అంటాడు.

మిథున ఇంటి ఓనర్ దగ్గరకు వెళ్లి నేత్రతో మాట్లాడాలి అడ్రస్ తెలుసా అని అడుగుతుంది. అతను తెలీదు అంటారు. ఆయన మిథునతో ఇంట్లో బంగారం లాంటి పెళ్లాన్ని పెట్టుకొని అదేం బుద్ధి అమ్మా అతనికి అని తిడతాడు. మిథున చాలా బాధ పడుతుంది.. ఎలా అయినా దేవా నిర్దోషి అని నిరూపించాలి అనుకుంటుంది. ఇంతలో ఆదిత్య కాల్ చేస్తే నా బాధలో నేను ఉంటే నువ్వేంటి ఆదిత్య అని అడుగుతుంది. మిథున దేవాకి బెయిల్ ఇప్పిస్తా అంటే వద్దు అన్నావ్ మరి ఏమైందో ఏంటో తెలుసుకోవాలి అని చేశా అంటాడు. దాంతో మిథున నేత్ర ఊరు వదిలి వెళ్లిపోయిందని చెప్తుంది. ఆదిత్య షాక్ అయినట్లు నటించి అయితే దేవాకి శిక్ష పడటం ఖాయం అని అంటాడు. నా భర్తకి అలాంటి పరిస్థితి రానివ్వను అని అంటుంది. నేను వచ్చే టైంకి తను వెళ్లిపోయింది. నేను వస్తున్నా అని చెప్పి తనని పంపేశారు. ఎవరో నన్ను నీడలా వెంటాడు తున్నారు. ఎవరో ఏంటే నేనే అని ఆదిత్య అనుకుంటాడు. మిథున ఆదిత్యతో ఆ నేత్ర ఎక్కడ ఉన్నా దాన్నిలాక్కొచ్చి మా ఆయన్ను బయటకు తీసుకొస్తా దాని వెనక ఉన్న వారిని బయటకు లాక్కొచ్చి పోలీస్‌ స్టేషన్‌లో పడేయకపోతే నా పేరు మిథున కాదు అని అంటుంది.

మిథున తన ఫ్రెండ్ స్వప్నకి కాల్ చేసి నేత్ర నెంబరు ఇచ్చి లొకేషన్ ట్రేస్ చేసి చెప్పమని అంటుంది. మిథున నేత్రని ఎలా అయినా కనిపెట్టేస్తుంది. నేత్ర వస్తే నేను దొరికిపోతా నేత్ర బతకడానికి వీళ్లేదు అని అనుకుంటాడు ఆదిత్య. మిథున ఆటో ఎక్కి అర్జెంటుగా వెళ్లాలి ఆటో తీయండి అంటుంది. మిథున భాను ఆటో ఎక్కుతుంది. భాను మిథునని దిగిపోమని చెప్పి నేను నిన్ను తీసుకెళ్లను అంటుంది. దేవాని రిలీజ్ చేయించడానికి వెళ్తున్నా అర్జెంట్‌గా పద అని మిథున అనడంతో నా రాజా కోసం తీసుకెళ్తా అని అంటుంది. నువ్వు రాజాని బెయిల్ మీద విడిపించాలి అనుకుంటున్నావ్.. అదే నేను అయితే ఆ పోరి దగ్గరకు వెళ్లి ఆటో కింద తొక్కించి కేసు వెనక్కి తీసుకుంటావా లేదా అని తొక్కించేదాన్ని అంటుంది. దాతో మిథున నేను అందుకే వెళ్తున్నా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.