Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా తల్లిని పట్టుకొని ఏడుస్తాడు. కారణం అడిగితే చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రమోదిని శారదతో దేవా బాధకి కారణం మీకు ఇంకా అర్థం కాలేదా అత్తయ్య దేవా మిథునని దూరం చేసుకోలేక మర్చిపోలేక తననలో తానే నరకం చూస్తున్నాడు.. అందుకే ప్రాణం పోతున్నట్లు విలవిల్లాడిపోతున్నాడు అని అంటుంది.

శారద ప్రమోదినితో తప్పదు ప్రమోదిని అటు దేవా ఇటు మిథునా ఇద్దరూ బాగుండాలి అన్నా రెండు కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలి అన్నా.. కన్నవాళ్లకి కడుపుకోత లేకుండా ఉండాలి అన్నా ఇదంతా తప్పడు అని అంటుంది. వాడి మనసులో బాధ బయటకు పోయేంత వరకు ఏడ్వనిద్దాం అని అంటుంది. ఆదిత్య మిథునకు వేరే వాళ్లతో పెళ్టి ఫిక్స్ అవ్వడంతో కోపంతో ఇంట్లో అన్నీ పగల గొట్టేస్తాడు. త్రిపుర వచ్చి ఆదిత్యను ఆపుతుంది. మిథునే నా జీవితం అనుకున్నా.. నా భార్య అని బతుకుతున్నా ఇప్పుడు మరొకడికి ఇచ్చి పెళ్లి చేయడం కరెక్టా అని ఆదిత్య అంటాడు. దానికి త్రిపుర పిచ్చోడా నువ్వు కోపం చూపించాల్సింది వస్తువుల మీద కాదు.. ఆ కోపాన్ని తీసుకొచ్చిన మనుషుల మీద అని అంటుంది. ఏదో ఒకటి చేసి ఆ హరివర్థనే నీ కాళ్లు పట్టుకొని నా కూతురికి నువ్వు తప్ప ఇంకెవరు దిక్కు లేరు అని బతిమాలేలా చేయాలని అంటుంది. ఆదిత్య ఆలోచనలో పడతాడు. నువ్వు పెళ్లి చేసుకుంటా అనుకున్న అమ్మాయి కోసం కుదిరితే యుద్ధం చేయ్ లేదంటే మోసం చేయ్ ఏదో ఒకటి చేసి తనని దక్కించుకో అని అంటాడు. మిథునని దక్కించుకోవాలి అంటే ఏం చేయాలో అదే చేస్తా అని అంటాడు.

మిథున, రిషి కలిసి బయటకు వెళ్తారు. రిషి కోసం ఆదిత్య వెయిట్ చేస్తే సడెన్‌గా ఎందుకు రమ్మన్నాడు ఏ విషయం అయింటుంది అని అనుకుంటాడు. రిషి మిథునతో నీ సమస్యకి పరిష్కారం ఇవ్వబోతున్నా మిథున.. నీ మెడలో బలవంతంగా పడిన తాళి కోసం నువ్వు ప్రతీక్షణం ఆలోచిస్తున్నావ్.. దాని వల్ల మనస్ఫూర్తిగా ఉండటం లేదు.. మనశ్శాంతిగా ఉండటం లేదు.. అందుకే నీ బాధకి నీ సమస్యకి ఒక పరిష్కారం ఇవ్వాలి అనుకుంటున్నా అని అంటాడు.

రిషి మిథునని దేవా దగ్గరకు తీసుకెళ్తాడు. మిథున, దేవా ఒకర్ని ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. రిషి దేవాతో మిథున విషయంలో ఓ పరిష్కారం కోసం నీ దగ్గరకు తీసుకొచ్చారా.. అని మిథునని ఒక వెధవ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని.. కథ మొత్తం దేవాకి చెప్తాడు. మిథున బాధ చూడలేకపోతున్నా.. అందుకే తనకి ఆ బాధ దూరం చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చా ప్రస్తుతం మిథున బాధకి పరిష్కారం నీ చేతిలోనే ఉందిరా అని అంటాడు. నిజం రిషికి తెలిసిపోయిందా ఏంటి అని మిథున, దేవా కంగారు పడతారు. రిషి దేవాతో నువ్వు నా బెస్ట్‌ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నా మాట వింటావు అనే నమ్మకం నాకు ఉంది.. మిథున మెడలో బలవంతంగా తాళి కట్టింది ఎవరు అని ఎంత అడిగినా మిథున పేరెంట్స్ చెప్పడం లేదు అందుకే అది ఎవరో నువ్వు కనిపెట్టి చెప్పాలిరా అని అంటాడు. మిథున, దేవా ఇద్దరూ షాక్ అయిపోతారు. వాడికి బుద్ధి వచ్చేలా శిక్షించాలిరా.. అప్పుడే మిథున ప్రశాంతంగా ఉంటుంది.. తన మనసులో బాధ పోతుంది అని దేవానే తిడతాడు. వాడు చెత్త వెధవ, వేస్ట్ ఫెలో అని అంటాడు. వాడు ఎంత అన్‌లక్కీ కాకపోతే ఇంత మంచి అమ్మాయిని వదిలేసుకున్నాడు.. మిథున లాంటి అమ్మాయి దొరకాలి అంటే రాసిపెట్టుండాలి.. నేను చాలా లక్కీరా అని రిషి అంటాడు. నాకు పని ఉందిరా వెళ్తా అని దేవా వెళ్లిపోతాడు.

ఆదిత్య మిథున దేవాల వివాహా వేడుక శుభాకాంక్షలు అని ఉన్న ఫొటోని పోస్టర్‌ని తీసుకొని ఆ పోస్టర్లు సిటీ మొత్తం టామ్ టామ్ అయిపోవాలని తన మనుషులకు చెప్తాడు. మిథున ఈ భూమ్మీద నేను ప్రేమించినంత నిన్ను ఎవరూ ప్రేమించరు.. ఆ రిషి గాడు నిన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను ప్రాణంగా ప్రేమించుకున్న నేను ఏమైపోవాలి అని అనుకుంటాడు. ఆ రిషి గాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలా వచ్చాడో అలా వెళ్లిపోవాలి అని అనుకుంటాడు. మిథున ఇంటికి వచ్చి రిషి దేవాతో మిథున మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోమని చెప్పాడని ఇంట్లో చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.