తెలుగు చిత్రసీమలోని ట్యాలెంటెడ్ హీరోల్లో నవీన్ చంద్ర (Naveen Chandra) ఒకరు. ఒకవైపు హీరోగా నటిస్తూ, మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమాల్లో 'పోలీస్ కంప్లైంట్' (Police Complaint Telugu Movie) ఒకటి. అందులో నవీన్ చంద్రకు జంటగా విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) నటిస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...

'పోలీస్ కంప్లైంట్' షూటింగ్ పూర్తి!
'పోలీస్ కంప్లైంట్' చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో వరలక్ష్మి ప‌వ‌ర్‌ ఫుల్ రోల్ చేస్తున్నారని దర్శకుడు తెలిపారు. మూవీలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏమిటంటే... సూపర్ స్టార్ కృష్ణపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్. అది సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాతలు చెబుతున్నారు.

Also Read: Balakrishna Taluka: బాలకృష్ణ తాలూకా ఎవరు? 'అఖండ 2'కు అండగా నిలబడేది ఎవరు?

'పోలీస్ కంప్లైంట్' గురించి దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ... ''ఈ సినిమా 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' కాన్సెప్ట్‌పై తీస్తున్నాం. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందని చెబుతున్నాం. ఇదొక హారర్ థ్రిల్లర్‌. మా చిత్ర బృందం మద్దతుతో చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేశాం. సినిమా బాగా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు పూర్తి కాగానే విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తాం'' అని చెప్పారు.

Also Read: 'అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?

'పోలీస్ కంప్లైంట్' సినిమాను ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ మ‌హరాణా నిర్మిస్తున్నారు. అఘోర (తెలుగు–తమిళం), ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం వంటి సినిమాలు తీసిన సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. నవీన్ చంద్ర, వరలక్ష్మీ శరత్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమాలో కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి ,సప్తగిరి, జెమినీ సురేష్ ,అమిత్, దిల్ రమేష్, పృథ్వీ (యానిమల్) ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్ఎన్ హరీష్, కూర్పు: అనుగోజు రేణుకా బాబు, సంగీతం: ఆరోహణ సుధీంద్ర - సుధాకర్ మారియో - సంజీవ్ మేగోటి, సాహిత్యం: సాగర్ నారాయణ - సంజీవ్ మేగోటి - చింతల ప్రసన్న రాములు, కళా దర్శకుడు: మురళీధర్ కొండపనేని.