Nindu Manasulu Serial Today April 15th: నిండు మనసులు: గణకి షాక్ ఇచ్చిన సిద్ధూ, ప్రేరణ! ఇంటి ఇల్లాలికి అవమానం!నిండు మనసులు: గణకి షాక్ ఇచ్చిన సిద్ధూ, ప్రేరణ! ఇంటి ఇల్లాలికి అవమానం!

6 hours ago 1
ARTICLE AD

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ మొదటి సారి అత్తారింట్లో వంట చేసి పంతుల్ని పిలిచి పూజ చేయిస్తుంది. ఇంట్లో అందరూ మీ కోడలు చేసిన వంట తినండి అప్పుడే ఇంట్లో అందరూ బాగుంటారు.. అంతా శుభం జరుగుతుందని పంతులు చెప్తారు. విజయానంద్ ముఖం మాడ్చుకొని ఈ వంటలు మాత్రం ఎవరూ తినొద్దు అని అనుకుంటాడు. నాకు ఆకలి లేదు అని విజయానంద్ తప్పించుకోవాలని చూస్తాడు.

ప్రేరణ అందర్ని కూర్చొమని వడ్డిస్తా అని చెప్తుంది. ఇక విశ్వాసం గణకి కాల్ చేసి మీకు మరో సమాచారం చెప్తా డబ్బులు కావాలి అంటాడు. సరే అని గణ అనడంతో ప్రేరణ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి తనే ఇంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయిందని అంటాడు. సీసీ ఫుటేజ్ పంపాను చూశారు కదా అందులో చెప్పినట్లే అంతా చేసింది.. ఇంట్లో ఆడుతూ పాడుతూ పనులు చేస్తుంది. ఇంట్లో వంట చేసింది.. అందరూ తినేలా చేస్తానని చెప్తుందని గణకి చెప్తాడు. గణ కోపంతో రగిలిపోయి ఏదో ఒకటి చేస్తా అని అంటాడు. ఇప్పుడే అక్కడికి వచ్చి అత్తాకోడళ్ల మధ్య అయినా.. మామ కోడళ్ల మధ్య అయినా పుల్ల పెట్టేస్తా అని అంటాడు.

ప్రేరణ ఇంట్లో అందరికీ భోజనం వడ్డిస్తుంది. నన్ను వేసేయడానికి వంటల్లో ఏమైనా కలపకపోతే బాగున్న అని విజయానంద్ మనసులో అనుకుంటాడు. ఇంతలో గణ వస్తాడు. ప్రేరణ చూసి మనసులో వీడు పుల్లలు పెట్టడానికే వచ్చినట్లు ఉన్నాడు. నేను ఏంటో వీడికి చూపించి పంపాలి అనుకుంటుంది. గణ వచ్చి తర్వాత వస్తా అని వెళ్తుంటే ప్రేరణ ఆపి భోజనం చేసే టైంలో శత్రువు వచ్చినా సరే వడ్డించాలి రండి వచ్చి కూర్చొండి అని అంటుంది. విజయానంద్ కూడా పిలవడంతో గణ వస్తాడు. సిద్ధూ పక్కనే గణ వచ్చి కూర్చొవడం చూసిన సిద్ధూ మనసులో ఈ ప్రేరణకి ఏమైంది వీడిని పిలిచింది.. వీడు సిగ్గు లేకుండా నా పక్కన కూర్చొన్నాడు వీడి పని చెప్తా అని అనుకుంటుంది. గణతో పాటు ప్రేరణ అందరికీ వడ్డిస్తుంది. విజయానంద్ బజ్జీ తిని కారం అని అరుస్తాడు.

గణ కోపంతో బజ్జీ కారం అయినా సరే చిరాకుతో మొత్తం తినేస్తాడు. అందరూ వింతగా చూస్తారు. నీరు కావాలా అని ప్రేరణ అడిగితే మగ్గుతో ఇచ్చేయ్ అని విజయానంద్ ఇస్తాడు. ఫ్యామిలీ అంతా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అని గణ అంటాడు. ఇక ప్రేరణ సిద్ధూకి పప్పు ఒప్పిస్తే సిద్ధూ కావాలనే ప్రేరణతో గొడవ పడినట్లు గణ మీద పోసేస్తాడు. ప్రేరణ సిద్ధూతో చెవిలో కావాలనే పోసేశావ్ కదా నాకు తెలుసు అని అంటుంది. సిద్ధూ కోపంగా చూస్తే ఎవరికీ చెప్పను అని అంటుంది. మధ్యలో లేవకూడదు తినండి అని ప్రేరణ ఇప్పుడే వస్తాను అని వాష్ రూంకి పరుగులు పెడతాడు. వాష్ రూంకి వెళ్లి కాలిపోయిందిరా మంట అని అరుస్తాడు. ఆ అరుపులు అందరికీ వినిపిస్తాయి. ఏం నైవేద్యమో ఏంటో ఒక వికెట్ అవుట్ అని విజయానంద్ అంటాడు.

విజయానంద్ బిజినెస్ గురించి ఇంట్లో ఓ రెండు ఫ్యామిలీలతో మాట్లాడుతాడు. ఇంతలో ప్రేరణని చూసి కాఫీలు తీసుకురమ్మని అంటాడు. విశ్వాసం వెళ్లి ప్రేరణమ్మ సమయానికి పని మనిషి లేదు కాఫీలు తీసుకొస్తారా ప్లీజ్ అని అంటాడు. సరే అని ప్రేరణ కాఫీ ఇస్తుంది. ఒకావిడ చీర మీద కాఫీ పడిపోవడంతో ఆవిడ ప్రేరణని తిడుతుంది. మంజుల వచ్చి నీకు ఎవరు కాఫీ ఇవ్వమన్నారు అని అంటుంది. ఇంతలో అందరూ అంత మంచిగా చెప్తారేంటి అదే మా పని మనిషి అయితే చెంప వాయించేవాళ్లం అని తిడతారు. ఈ పని మనిషిని తీసేయండి అని అంటారు. ఎవరు పని మనిషి అని సిద్ధూ అరుస్తూ అక్కడికి వస్తాడు. మీకు మర్యాదలు తక్కువ చేసిన వాళ్లు పని మనుషులు కాదు.. చిన్నదానికే ఇంత గొడవ చేస్తారా అని తనకి మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అని అడుగుతాడు. పని మనిషి కోసం ఇంటికి వచ్చిన వాళ్లని అవమానిస్తారా అని అడిగితే తను పని మనిషి కాదు.. అని సిద్ధూ అంటే మరి ఎవరు అని అడుగుతారు. నేను సిద్ధూ గారి భార్యని.. అని ప్రేరణ చెప్తుంది. విజయానంద్ వాళ్లని పంపేస్తాడు. ప్రేరణ సిద్ధూతో దీని బట్టి నీకు నేను ఇష్టం అని అర్థమైందని అంటుంది. అంత లేదు సిద్ధూ అంటే.. నీతో నేను నీ భార్యని అని చెప్పించుకోకపోతే నా పేరు ప్రేరణే కాదు అని ఛాలెంజ్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Read Entire Article