Most Cheapest Car In India | కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ స్లాబ్‌లలో సంస్కరణలు చేసింది. జీఎస్టీ కొత్త స్లాబ్‌లలో కొన్ని రకాల కార్లపై 28 నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గించారు. దాంతో పలు కంపెనీల కార్ల ధరలు దిగొచ్చాయి. సెప్టెంబర్ 22 నుంచి తగ్గించిన ధరలు అమలులోకి రానున్నాయి. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, అరీనా, నెక్సా డీలర్‌షిప్‌లలో విక్రయించే అన్ని కార్ల కొత్త ధరలను తాజాగా ప్రకటించింది. మారుతి కంపెనీ రూ. 1.30 లక్షల వరకు కార్ల ధరలను తగ్గిస్తూ శుభవార్త చెప్పింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తర్వాత, కంపెనీకి చెందిన ఆల్టో K10 కంటే చౌకైన మోడల్ మరో కారు అయింది.

కొత్త GST 2.0 ప్రభావం ఇతర కంపెనీలతో పాటు మారుతి కార్లపై పడింది. ఇప్పుడు మారుతి S-Presso కొత్త ఎంట్రీ లెవెల్ కారుగా మారింది. ఈ మైక్రో SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 3.49 లక్షలు. ఆల్టో కొత్త ధర రూ. 3.69 లక్షలు అయింది. అంటే రెండింటి మధ్య ధరలో రూ. 20 వేలు వ్యత్యాసం ఉంది. దాంతో ఇప్పుడు మారుతి నుంచి చౌకైన కారుగా మారుతి S-Presso మారింది.

మారుతి S-Presso మైలేజ్

మారుతి S-Presso 8 వేరియంట్‌లలో అందుబాటులోకి వస్తుంది. ఇందులో బేస్ మోడల్ STD, టాప్ వేరియంట్ VXI CNG ఉన్నాయి. ఇది 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 68PS పవర్, 90Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. అయితే CNG వెర్షన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌లో మాత్రమే లభిస్తుంది. Maruti S-Presso పెట్రోల్ వేరియంట్‌లో 24.12 నుంచి 25.30 కిలోమీటర్లు మైలేజ్, అయితే CNG వేరియంట్‌ 32.73 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి S-Presso ఫీచర్లు

మారుతి S-Presso 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందిస్తుంది. కీలెస్‌ ఎంట్రీతో పాటు సెమీ-డిజిటల్ క్లస్టర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ABS+EBD వంటి ఫీచర్లతో మార్కెట్లో లభ్యం కానుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, ఫీచర్‌లను కోరుకునే వారికి Maruti S-Presso బెస్ట్ ఛాయిస్ అని కంపెనీ చెబుతోంది. మారుతి S-Presso మైలేజ్ విషయానికి వస్తే దాని పెట్రోల్ MT వేరియంట్ లీటర్‌కు 24 కి.మీ, పెట్రోల్ MT 24.76 kmpl, CNG వేరియంట్ ఒక కేజీకి 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.