Mirai - Little Hearts: టాలీవుడ్‌లో పాతికేళ్ళ క్రితం నాటి సీన్ రిపీట్... ఇప్పుడు చిన్న సినిమాలే పెద్ద దిక్కు
2 months ago 3
ARTICLE AD
వరుస ప్లాపులతో డీలాపడ్డ టాలీవుడ్ ను సెప్టెంబర్ నెల ఆదుకొంది. పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు చేతులెత్తేసిన చోట చిన్న సినిమాలు చిన్న హీరోలు వరుస హిట్లు కొడుతున్నారు. ఈ నెలలోనే 'లిటిల్ హార్ట్స్', 'మిరాయ్' లాంటి సినిమాలు టాలీవుడ్ ను ఊపిరి పీల్చుకునేలా చేశాయి. అంతకు ముందు మరో చిన్న సినిమా 'కోర్ట్' కూడా పెద్ద హిట్ గా నిలబడింది. వందల కోట్లతో తీసిన సినిమాలు బకెట్ తన్నేస్తున్న వేళ  చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం థియేటర్లకు జనాల్ని రప్పిస్తున్నాయి. ఎప్పుడో జనవరిలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మినహా పెద్ద హీరోల సినిమాలు ఆ రేంజ్ లో హిట్ కాలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన 'డాకు మహారాజ్' పర్వాలేదనిపించుకోంది తప్ప అనుకున్న స్థాయిలో లాభాలు రాలేదని నిర్మాతే స్వయంగా చెప్పారు. అయితే టాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితి కొత్త కాదు. పాతికేళ్ళ క్రితం సేమ్ ఇలాంటి పరిస్థితే తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొంది.
2000-2001 మధ్య టాలీవుడ్ ని బతికించిన చిన్న సినిమాలు
2000 - 2001 మధ్యకాలంలో తెలుగు పరిశ్రమల ఇలాంటి పరిస్థితి చవి చూసింది. అంతకు ముందు వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న పెద్ద హీరోలు నెమ్మదిగా ఏడాదికి ఒక్క సినిమాకే పరిమితం కావడం మొదలుపెట్టారు. 'రిక్షావోడు', 'బిగ్ బాస్'ల తర్వాత బ్రేక్ తీసుకున్న చిరంజీవి 'హిట్లర్'తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. 'చూడాలని ఉంది' లాంటి భారీ హిట్లు పడినా 2002లో వచ్చిన 'ఇంద్ర' వరకూ మాస్ సినిమా చేయలేదు ఆయన.  'యువరత్న రాణా', 'దేవుడు' లాంటి ఫ్లాప్స్ తర్వాత 1999లో 'సమరసింహారెడ్డి' లాంటి సూపర్ హిట్ కొట్టినా ఆ తర్వాత వచ్చిన 'సుల్తాన్', 'కృష్ణ బాబు' లాంటి ప్లాపులతో బాలకృష్ణ ఇబ్బంది పడ్డారు. 'నరసింహనాయుడు' వరకూ ఆయన రేంజ్ సినిమా పడలేదు. మరోవైపు నాగార్జున కూడా వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. 2000లో వచ్చిన 'నువ్వు వస్తావని' తర్వాత 2002లో వచ్చిన 'సంతోషం' వరకు తన స్థాయి సోలో హిట్ లేదు. పెద్ద హీరోల్లో ఒక్క వెంకటేష్ మాత్రమే ఆ టైంలో వరస హిట్లలో ఉన్నారు.
జనరేషన్ మారి మిలీనియం కుర్రోళ్ళ టేస్ట్ మారిన కాలం అది. వెటరన్ హీరోలు మోహన్ బాబు, సుమన్, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు హీరోలుగా ఫేడ్ అవుట్ అవుతున్న టైం అది. పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' స్వింగ్ లో ఉండగా మహేష్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు ఇంకా సూపర్ స్టార్లు గా ఎదగని దశ అది. ఆ టైంలో తెలుగు సినిమాని ఆదుకుంది చిన్న సినిమాలే.
వరుసహిట్లతో TFI దశ మార్చిన చిన్న సినిమాలు చిన్న హీరోలు
2000 నాటికి ఇంకా థియేటర్లన్నీ డిటిఎస్ లుగా మారలేదు. చాలా సినిమాలు స్టీరియో ఆడియోలోనే రిలీజ్ అయ్యేవి. వాటికి బడ్జెట్ తక్కువ కావడంతో ఎక్కువ మంది చిన్న  నిర్మాతలు  సినిమాలు తీయడానికి ముందుకు వచ్చేవారు. మల్టీప్లెక్స్ కల్చర్ అనేది తెలియదు.  జగపతి బాబు, శ్రీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అదే సమయంలో ఉషా కిరణ్ మూవీస్ 'చిత్రం' అనే సినిమాతో టాలీవుడ్ లో సంచలనం రేపింది. చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా సూపర్ హిట్ కావడంతో తేజ రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఆ తర్వాత 'నువ్వు నేను' లాంటి మరొక చిన్న సినిమాతో సూపర్ హిట్ కొట్టారు.  తరుణ్ హీరోగా వచ్చిన 'నువ్వే కావాలి' ఆ సమయంలో ఒక సంచలనం. వీటికన్నా ముందు వేణు హీరోగా వచ్చిన 'స్వయంవరం', శివాజీ హీరోగా వచ్చిన 'కాలేజ్', 'బ్యాచలర్స్', '6టీన్స్', 'ఆనందం' లాంటి సినిమాలు వరుస హిట్లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని పరుగులెత్తించాయి. ఆకాష్, ఉదయ్ కిరణ్, తరుణ్, వేణు, శివాజీ, రోహిత్ లాంటి ఎంతోమంది యంగ్ స్టర్స్ హీరోలుగా వెలుగులోకి వచ్చారు. ఒక రెండేళ్ల పాటు ఆ హవా నడిచింది. 2003లో 'ఒక్కడు'తో మహేష్ బాబు, 'సింహాద్రి'తో ఎన్టీఆర్, అంతకు ముందు 'ఖుషి'తో పవన్ కళ్యాణ్, 2004లో 'వర్షం'తో ప్రభాస్ అలాంటి వాళ్లు నయా సూపర్ స్టార్లుగా స్థిరపడడంతో టాలీవుడ్ లో వారి శకం మొదలైంది.
పాతికేళ్ల తర్వాత మళ్లీ అదే సీన్... 'లిటిల్ హార్ట్స్, మిరాయ్'తో
25 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి టాప్ స్టార్స్ పాన్ ఇండియా సినిమాలతో ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి లో ఉన్నారు.  చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ  లు టీనేజ్ కథలు చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో  మళ్లీ టాలీవుడ్ కి  చిన్న సినిమాలు చిన్న హీరోలే. దిక్కవుతున్నారు. దానికి తోడు ఆడియన్స్ అభిరుచి మరోసారి మారిపోయింది. స్టార్ వాల్యూ కన్నా  కథలో కొత్తదనం ఉంటేనే సినిమాలు చూస్తున్నారు. అందుకే కొత్త పాయింట్ ఉంటే చాలు హీరో ఎవరన్నది పట్టించుకోవడం లేదు. ఈ ట్రెండ్ వల్ల  టాలీవుడ్ లో కొత్త కథలు, కొత్త నిర్మాతలు, కొత్త నటులు, దర్శకులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
Also Read: ఎన్టీ రామారావుతో సినిమా తీసిన తాత... 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనవడు... 'లిటిల్ హార్ట్స్' దర్శకుడి బ్యాగ్రౌండ్ తెల్సా?
Read Entire Article