Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న కంపెనీ లాభాలు చూపించమని మేనేజర్తో చెప్తుంది. అందుకు మ్యానేజ్ చేయమని అంటే ఇంకా ఎన్ని మ్యానేజ్ చేస్తావ్ జ్యోత్స్న అంటూ దశరథ్ ఎంట్రీ ఇస్తాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలీదు డాడీ అని జ్యోత్స్న అంటే నిజంగా తెలీదా అని దశరథ్ అంటాడు. అబద్ధం చెప్తున్నావ్ అని నీకు నాకు తెలిసిన వాళ్లు నాకు క్లారిటీ ఇవ్వాలి అని అంటాడు.

దశరథ్: నిజం చెప్పు నువ్వే తప్పు చేయలేదా. తప్పు చేస్తున్నావ్ జ్యోత్స్న. నేను మాట్లాడుతుంది ఆడిట్ల కోసం. ఎర్లీ స్టేజ్‌లో ఉన్నావ్ కదా ఏమైనా సమస్య ఉంటే క్లియర్ చేసుకో జ్యోత్స్న. ఎంత పెద్ద తప్పు చేసిన వాడికైనా తప్పు సరిదిద్దుకునే అవకాశం భగవంతుడు ఇస్తాడు. అప్పుడు కూడా సరిదిద్దుకోకపోతే ఇక ఏం చేయలేం.
జ్యోత్స్న: నో డౌట్ దాసు గురించి డాడీకి డౌట్ వచ్చింది. ముందు ఆడిట్ గురించి చూసి తర్వాత దాసు, దీపల సంగతి చూడాలి. వాళ్లని బతకనివ్వకూడదు.

దీప ఓ టిఫెన్ బండి తీసుకుంటుంది. దాన్ని కాంచన, దీప, అనసూయలు క్లీన్ చేస్తారు. కార్తీక్ వచ్చి ఏంటి ఇది అని అడిగితే నా కోసం ఈ బండి తీసుకున్నానని దీప అంటుంది. నాతో ఒక్క మాట చెప్పలేదని కార్తీక్ అడిగితే మేం ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకొని ఈ బండి తీసుకున్నాం దీంతో మీకు ఏం సంబంధం లేదు అంటుంది.

కార్తీక్: సంబంధం లేదు అంటే.
దీప: సంబంధం లేదు అంటే ఇప్పటి నుంచి ఈ ఇడ్లీ బండిని దీపే నడుపుతుంది.
అనసూయ: దీపకు సాయంగా నేను ఉంటాను బాబు.
కాంచన: నేను ఉంటానురా.
కార్తీక్: ఏంటి దీప ఇది ఇప్పుడు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు.
దీప: మీరు ఈ బండి దగ్గరకు రావొద్దు కార్తీక్ బాబు వస్తే శౌర్య మీద ఒట్టే.
కార్తీక్: దీప రాను రాను నీ ప్రవర్తనకు అర్థం లేకుండా పోతుంది.
కాంచన: ఏంటి దీప ఇలా చేశావ్ ఉన్న విషయం వాడికి కాస్త అర్థమయ్యేలా చెప్పాల్సింది. వెళ్లి ముందు వాడికి ఇదంతా ఎందుకు చేస్తున్నామో అర్థమయ్యేలా చెప్పు.
దీప: అలాగే అమ్మ శౌర్య నువ్వు ఇక్కడే ఉండు.
కార్తీక్: శౌర్య మీద ఒట్టేయించడం ఏంటి నేను నీ మాట విననా. వాళ్ల అన్న మాటలకే కదా నువ్వు ఇదంతా చేసింది.
దీప: కాదు బాబు మీరు గెలవడానికి. ఇడ్లీ బండి పెట్టుకునే స్థాయి దీపది. కార్తీక్ బాబుది కాదు. మీరు మా గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచించండి రెస్టారెంట్ గురించి ఆలోచించండి. మీ విలువైన సమయం టిఫెన్ బండి దగ్గర ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. ఇక నుంచి టిఫెన్ బండి మేం చూసుకుంటాం. మీరు మీ పని చూసుకోండి.
కార్తీక్: నేను చూసుకుంటా దీప.
దీప: మీరు రావొద్దు మీరు నాతో పాటే ఉంటే గెలవలేరు. గెలవాలి అంటే మీరు పరుగెత్తండి. నాతో ఉండిపోతే కాదు.
కార్తీక్: అనుకోగానే అవకాశాలు రావు కదా దీప. వాటి గురించే ఆలోచిస్తున్నా.
దీప: మీరు అన్నది నిజమే బాబు అందుకే ఇక మీరు ఆ పని మీదే ఉండండి. సైకిల్ చక్రాలు అరిగిపోయాలా తిరుగుతారో.. కాళ్ల చెప్పులు అరిగిపోయేలా తిరుగుతారో తిరగడం. అప్పటి వరకు బండిని ఇంటిని మిమల్ని నేను చూసుకుంటా. మీరు మాకు సాయంగా ఉండాల్సిన అవసరం లేదు. మీకు అవసరం అయిన రోజు నేను ఇడ్లీ బండి అయినా వదిలేస్తా కానీ మిమల్ని అక్కడికి రానివ్వను. మీ గెలుపు మీ తాతయ్య నాన్నతో పాటు మేం చూడాలి. మళ్లీ మా కార్తీక్ బాబుకి పూర్వవైభవం కావాలి. కాదన్న వాళ్లే ఎదురొచ్చి స్వాగతం పలకాలి. ఇక మీకు ఇడ్లీ బండికి సెలవు. దాన్ని నేను చూసుకుంటా.
కార్తీక్: మనసులో నీ అభిమానం ప్రేమ నాకు అర్థమవుతుంది దీప. ఒక్క అవకాశం దొరకనీ నేనేంటో చూపిస్తా.

జ్యోత్స్న కార్తీక్‌తో తన నిశ్చితార్థం ఫొటోలు చూసుకుంటూ బాధ పడుతుంది. ఇంతలో పంతులు ఇంటికి వస్తారు. ఎందుకు వచ్చారని అడిగితే పారిజాతం హోమం జరిపిస్తామని ఎందుకు అంటే దాసు కోసం అని చెప్తుంది. తన కోసం ఇప్పుడు ఎందుకని జ్యోత్స్న అంటుంది. దాసు కోలుకోవాలని హోమం చేయించాలని పారిజాతం అంటే అలాంటివి వద్దని పంతులుతో చెప్తుంది. హోమం చేస్తే నీ కొడుకుకి నయం అయిపోతుందని అనుకుంటున్నావా అని అడుగుతుంది.

దశరథ్: ఏం నయం కావొద్దని నువ్వు కోరుకుంటున్నావా.
పారు: అది ఎందుకు అలా కోరుకుంటుంది. వాడు కోలుకోవాలని కోరుకుంటుంది.
దశరథ్: నిజమా జ్యోత్స్న. పంతులు గారు మంచి ముహూర్తం పెట్టండి తను త్వరగా కోలుకోవాలి.
జ్యోత్స్న: దాసుని నేనే కొట్టానని డాడీకి అనుమానం వచ్చిందా. వాడు కోలుకుంటే మళ్లీ నా చేతిలో చస్తాడు.
శివన్నారాయణ: జ్యోత్స్న వెరీ గుడ్ అమ్మా. ఆడిటర్ కాల్ చేశాడు. రెస్టారెంట్ ప్రోగ్రస్ బాగుందని చెప్పాడు.
దశరథ్: మనసులో లాభాలు రావడం ఏంటి నష్టాలు ఉన్నాయి కదా జ్యోత్స్న ఇది కూడా మ్యానేజ్ చేసిందా.
సుమిత్ర: ఇప్పుడే కాస్త మంచి పేరు తెచ్చుకుంటున్నావ్ జాగ్రత్తగా ఉండు.
దశరథ్: జ్యోత్స్న ఏదో తప్పు చేసింది జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలి అంటే దాసుకోలుకోవాలి.

దీప వేకువ జామున తులసి కోటకి దీపం పెట్టి తన కోరిక తీరాలని కోరుకుంటుంది. దీప దగ్గరకు కార్తీక్ వస్తాడు. వేకువన పూజ ఏంటి అని అంటే బ్రహ్మాముహూర్తంలో కోరుకుంటే మంచిదని కోరిక నెరవేరుతుందని అంటుంది. ఇక కార్తీక్‌ని మొక్కుకోమని అంటే కార్తీక్ దీపతో కలిసి తులసి కోటకి హారతి ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని నిజాలు దాస్తావు జ్యోత్స్న.. వారసురాలి గురించి తెలుసుకున్న దశరథ్!