Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ తాను ఇంటి నుంచి వెళ్లను అని విహారితో పెళ్లి బంధం నుంచి దూరం వెళ్లిపోమని చెప్పొద్దని యమున కాళ్ల మీద పడి ఏడస్తుంది. యమున మనసులో దేవుడా ఇప్పుడేం చేయాలి నా సొంత మనిషి అయిన లక్ష్మీ వైపు నిలబడాలా లేక ఇంకేం చేయాలా నాకేం అర్థం కావడం లేదు అని యమున కన్నీరు పెట్టుకుంటూ వెళ్లిపోతుంది.

విహారి విడాకులు అవ్వనందుకు హ్యాపీగా ఫీలవుతాడు. లక్ష్మీ విడాకులు ఎందుకు కావాలి అనుకుంటుంది అని అనుకుంటాడు. లక్ష్మీ అటుగా వెళ్లడం చూసి లక్ష్మీ దగ్గరకు వెళ్తాడు. విడిపోవాలి.. విడాకులు కావాలి అని అడిగావ్.. మరి నేను తాళి తీస్తాను అంటే ఎందుకు వద్దు అన్నావ్.. జడ్జి మాటలకు ఎందుకు ఒప్పుకున్నావ్ అని అడుగుతాడు. వివాహ బంధానికి విలువ ఇచ్చానని అంటుంది. మన మధ్య ఒకరి మీద ఒకరికి అభిమానం తప్ప ఇంకేం లేదు అది గుర్తుంచుకోండి అని అంటుంది. అయితే నా మీద ఇష్టం లేదు అంటావ్ అంటే కదా అని అడుగుతాడు. అవును అని లక్ష్మీ అంటుంది. నా కోపం పూజలు చేశావ్ నా ప్రాణాల మీదకు వస్తే విలవిల్లాడిపోయావ్ అంటే సాటి మనిషిగా మీ ప్లేస్‌లో ఎవరు ఉన్నా అలాగే చేస్తాను అంటుంది. నా మీద ఇష్టం లేదు కదా.. కేవలం అభిమానంతోనే ఇకపై ఏమైనా చేస్తావా అంటే అవును అని లక్ష్మీ అంటుంది.

విహారి లక్ష్మీతో ఇప్పటి నుంచి నెల వరకు నువ్వు నా కోసం నా ఫ్యామిలీ ఏం చేయొద్దు.. అప్పుడు నేను నువ్వు నన్ను అభిమానిస్తున్నావ్ అని అనుకుంటా అంటాడు. లక్ష్మీ విహారి వెళ్లిపోయిన తర్వాత విహారి గారు మీరు అంటే నాకు ప్రాణం కానీ ప్రాణం పోయిన ఆ విషయం చెప్పను.. నేను అలా చెప్తే మీరు అందరికీ నిజం చెప్పేస్తారు. సహస్రమ్మకి అన్యాయం చేస్తారు. అలా ఎప్పటికీ జరగనివ్వను అని అంటుంది.

కాదాంబరి, పెద్దాయన ఇంటికి వస్తారు. ఇంట్లో అందరితో మాట్లాడుతారు. విహారికి ఏమైనా అయితే అని కంగారుగా వచ్చేశాం అని పెద్దాయన అడిగితే విహారికి ఏమైనా అయితే నేను చూస్తూ ఉంటానా అని పద్మాక్షి అంటుంది. ఇక అంబిక గురించి అడిగితే రెస్ట్ తీసుకుంటుందని చెప్తారు. అమ్మవారి దయ మనకు ఎప్పుడు కలుగుతుందో అని పెద్దాయన అనడంతో సీన్ రామపురానికి వెళ్తుంది. నడిరోడ్డు మీద పోచమ్మ గవ్వలు వేస్తుంది. ఊరి మొత్తం పోచమ్మ దగ్గర నిల్చొంటారు. ఊరి పెద్దలు పోచమ్మతో ఏమైంది అమ్మ అని అడిగితే అమ్మ ఊరి మీద కోపంగా ఉందని పోచమ్మ చెప్తుంది. ఊరు మొత్తం ఇలా కరువులో మునిగిపోవడం ఏంటమ్మా.. చావు చూడని ఇళ్లు లేదు.. మా కన్నీరు కార్చడానికి కూడా నీరు లేవమ్మా ఇక ఆత్మహత్యలే శరణ్యం అని ఊరి వారు ఏడుస్తారు.

పోచమ్మ అందరితో అమ్మవారు కోపంగా ఉంది.. అమ్మవారు శాంతించకపోతే మన గతి ఇక అంతే అంటుంది. అమ్మవారిని మొక్కుకుంటుంది. ఇంతలో ఒకావిడకు అమ్మవారు పూనుతుంది. రెండు పుష్కరాల నుంచి సారె ఆపేశారు. పూజలు ఆపేశారు.. ఆనవాయితీ గుర్తు లేదా.. నా ఆగమనం గుర్తించి ఆ కుటుంబం.. నా విగ్రహం వెలికి తీసిన ఆ కుటుంబం చేతులు మీదగా పూజలు జరగాలి.. ఆ ఇంటి వాళ్లు సారె ఇవ్వడం వదిలేశారు.. అందుకే ఈ కరువు.. వాళ్లు రావాలి.. ఈ దసరా లోపు వాళ్లు వచ్చి సారె ఇవ్వకపోతే ఇంకా కరువు చూస్తారని అంటుంది.

పోచమ్మ ఊరి వాళ్లతో మనం చేసిన తప్పిదమే మనకి ఈ పరిస్థితి తీసుకొచ్చింది అంటుంది. ఆ కుటుంబం వస్తుందా అమ్మ మనం అంత అవమానించి పంపాం అని సుబ్బారావు అంటే కచ్చితంగా పిలవాలి.. వాళ్లు రావాలి లేదంటే ఊరు స్మశానం అయిపోతుందని అంటారు. విహారి బాబాయ్ వచ్చి వాళ్లని మీరు అవమానించి ఊరు నుంచి గెంటేశారు వాళ్లు ఎలా వస్తారు అనుకున్నావ్ అని అంటాడు. ఎలా అయినా వాళ్లు ఎక్కడున్నారో వెతికి తీసుకురావాలి అని పోచమ్మ అంటుంది.

పద్మాక్షి ప్రకాశ్‌తో మాట్లాడి లక్ష్మీని ఇంకా తీసుకెళ్లడం లేదు ఏంటి అంటే లక్ష్మీ రావడానికి ఇష్టం పడటం లేదని అంటాడు. ఇక పద్మాక్షి ఫ్రీ గా ప్లాట్ వస్తుంది ఒకసారి మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వు అని అంటుంది. ఫ్రీ అనగానే ప్రకాశ్‌ ముందు వెనక ఆలోచించకుండా ఇస్తా అని చెప్తాడు. పోచమ్మ, సుబ్బయ్య, మరో ఇద్దరు పెద్దలు హరికృష్ణ కుటుంబం కోసం సిటీకి వస్తారు. విహారి బాబాయ్ తన మనిషికి కాల్ చేసి వాళ్లని ఫాలో అయి పోచమ్మని చంపేయ్ అని చెప్తాడు. పోచమ్మని లారీ గుద్దే టైంకి లక్ష్మీ వచ్చి కాపాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.