Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర చేతులకు విహారి కోన్ పెట్టిన కొద్ది సేపటి తర్వాత సహస్ర చేతులు మంట అని ఏడుస్తుంది. దాంతో విహారి సహస్ర చేతులు కడుగుతాడు. సహస్ర చేతులకు బొబ్బలు వస్తాయి. కోన్స్‌ తెచ్చిన లక్ష్మీని పద్మాక్షి కొడుతుంది. సహస్ర మీద ఈర్ష్యతో కోన్స్‌లో ఏదో కలిపిందని అంటుంది. యమున లక్ష్మీని కొట్టదని చెప్తే అంబిక లక్ష్మీనే కావాలని చేసిందని అంటుంది.

సహస్ర: తనకి ఎవరూ సపోర్ట్ చేయొద్దు ఎందుకంటే ఈ ఇంట్లో నేను బాగుంటే తట్టుకోలేదని తను మాత్రమే.
కాదాంబరి: నువ్వు సంతోషంగా ఉంటే దానికి ఎందుకే అంత కుళ్లు.
సహస్ర: ఎందుకంటే తను బావని ఇష్టపడుతుంది కాబట్టి.
లక్ష్మీ: లేదమ్మ గారు నేను విహారి బాబుని ఇష్టపడటం ఏంటి.
వసుధ: సహస్ర లేనిపోనివి ఊహించుకొని ఎందుకు అమాయకురాలి మీద లేని పోని నిందలు వేస్తావు.
పద్మాక్షి: అది అమాయకురాలు ఏంటి ఇలాంటి వాళ్లే వెనక గోతులు తవ్వుతారు.
విహారి: అత్తయ్య దయచేసి ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి.
కాదాంబరి: తేరగా తింటూ నువ్వు వెలగబెడుతున్న కార్యాలు ఇవేనా.
యమున: అత్తయ్య మాటలతో తనని హింసించింది చాలు. దయచేసి ఇక వదిలేయండి.
పద్మాక్షి: గతిలేని వాళ్లు అంతా ఇంటిలో ఉంటే ఇలాగే ఉంటుంది. మా ఖర్మ కొద్ది ఒక్కొక్కరు తగిలారు. నాకూతురికి ఏమైనా కావాలి అప్పుడు చేతులు మీద వాతలు పెడతాడు.
విహారి: ఆపండి తను ఏం చేయలేదు అంటుంది కదా అయినా ఎందుకు అందరూ తననే అంటున్నారు.
పద్మాక్షి: రేపు ఇలానే పెళ్లిలో ఏదైనా పొరపాటు జరిగితే నేను అస్సలు సహించను. రావే.
లక్ష్మీ: ప్రమాణ పూర్తిగా నేను ఏ తప్పు చేయలేదు.
యమున: నువ్వు ఏతప్పు చేయవు అని మాకు తెలుసు లక్ష్మీ. పద..
మదన్: నా డ్రీమ్ గల్ దొరికింది అనే హ్యాపీనెస్‌లో ఉంటే ఇలా జరిగిందేంటి ఏది ఏమైనా తనతో ఫ్రెండ్‌షిప్ పెంచుకొని తర్వాత తనతో ఎస్ చెప్పించుకొని ఎప్పుడూ తనకే సపోర్ట్ చేస్తా.

లక్ష్మీ పద్మాక్షి మాటలు తలచుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే డస్ట్‌బిన్‌లో కోన్‌ కనిపిస్తుంది. దాన్ని తీసి చూస్తుంది. డస్ట్‌బిన్‌లో తాను తెచ్చిన కోన్స్‌ పడి ఉండటం చూసి వేరే కంపెనీ బాక్స్‌లో అవి ఉండటం చూసి అనుమానం వచ్చి ఆ దాని మీద ఉన్న నెంబరుకు కాల్ చేసి ఎవరు ఆర్డర్ పెట్టారని అడుగుతుంది. అంబిక ఆర్డర్ పెట్టారని తెలుసుకుంటుంది. అంబిక ఇది నీ పనా అని అంబిక దగ్గరకు వెళ్తుంది. మరోవైపు విహారి సహస్రని తీసుకొచ్చికూల్ చేసి మళ్లీ కోన్ పెడతాడు. పద్మాక్షి విహారికి థ్యాంక్స్ చెప్తుంది. దానికి విహారి మీ కోపంలో అర్థముంది అత్తయ్య కానీ దానికి సరైన సాక్ష్యం ఉండాలి అని అంటాడు. ఇక వసుధ సహస్రతో అదృష్టవంతురాలివి సహస్ర అర్థం చేసుకునే భర్త దొరికాడని అంటుంది. సహస్ర విహారికి లవ్ యూ చెప్తుంది. రేపు పెళ్లి కదా ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఫార్మాలిటీస్ అంటే వసుధ, పద్మాక్షిలు లవ్‌యూ టూ చెప్పమంటారు దాంతో విహారి లవ్యూ2 అని చెప్తాడు. అంబిక దగ్గరకు లక్ష్మీ వస్తుంది. కోపంగా చూస్తుంది. కోన్స్ పట్టుకొని వచ్చి అంబిక ముఖం మీద నుంచి విసురు తుంది. అంబిక షాక్ అయిపోతుంది.

అంబిక: ఏంటీ ఈ చెత్త నా ముందు వేశావ్
లక్ష్మీ: ఈ చెత్త ప్లాన్ మీదే కదా. మీకు ఈగో డబ్బు పిచ్చి అహంకారం, పెత్తనం చెలాయించాలి అనుకోవడం ఇలా అన్ని అవలక్షణాలు ఎక్కువయ్యాయి. వాటికి తోడు ఈ మధ్య అందరిలో నన్ను అవమానించాలి అన్న కోరిక ఎక్కువైపోయింది. ఇది తగ్గించుకుంటే మీకే మంచిది.
అంబిక: ఏంటే వాగుతున్నావ్ అని కొట్టడానికి చేయి ఎత్తితే లక్ష్మీ అడ్డుకుంటుంది.
లక్ష్మీ: చేయి మీకే కాదు నాకు ఉంది. కొట్టే శక్తి నాకు ఉంది. కానీ దెబ్బ తగిలిన తర్వాత తీసుకొనే శక్తి మీకు ఉందా.
అంబిక: నన్ను కొడతావా.
లక్ష్మీ: నేను ఎందుకు కొడతాను. నాకు ఏంటి అవసరం. మీరు ఆర్డర్ పెట్టిన కోన్స్ విహారి బాబు ముందు పెడితే సాక్ష్యాలతో నిరూపిస్తే ఈ సారి మీ బతుకు ఇంటి బయటే. మీ వంకర బుద్ధి తెలిసి అందరూ గెంటేస్తారు. ఈ సారి నా జోలికి వస్తే ఇంత మర్యాదగా కూల్‌గా చెప్పను. నేనేంటో నీకు చూపించాల్సి వస్తుంది.
అంబిక: నా ముందు నొల్చొనే అర్హత లేని దీనికి ఎంత ధైర్యం దీని జీవితం నాశనం చేసే వరకు నేను ఊరుకోను.

ఇంటిళ్ల పాది పెళ్లి పందిరి డెకరేషన్ చూసి తెగ సంబర పడతారు. రేపు ఈ టైంకి విహారి, సహస్రల పెళ్లి అయిపోతుందని అనుకుంటారు. పద్మాక్షి చాలా టెన్షన్ పడుతుంది. పెళ్లి అనుకున్నట్లు జరగకపోతే హస్ర బతకదు అని అంటుంది. నెగిటివ్‌గా ఆలోచించొద్దని అందరూ పద్మాక్షికి చెప్తారు. ఇక విహారి కనకంతో తనకు జరిగిన పెళ్లిని గుర్తు చేసుకొని ఆదికేశవ్ అప్పగింతలు తలచుకొని బాధపడతాడు. ఇంతలో లక్ష్మీ అక్కడికి వస్తుంది. ఈ పెళ్లి ఎలా అయినా జరగాలి అలా అని నీకు అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదని విహారి అంటాడు. రేపే మీ నాన్న గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పని లక్ష్మీతో అంటాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని నిజాలు దాస్తావు జ్యోత్స్న.. వారసురాలి గురించి తెలుసుకున్న దశరథ్!