kalavari kodalu kanaka Mahalakshmi serial today episode లక్ష్మీ సహస్ర చెప్పిన మాటతో ఇంటి నుంచి వెళ్లిపోతానని అంటుంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మీ ఇంటి నుంచి వచ్చేసిన రాత్రి విహారి గదికి వెళ్లి ఏడ్చిన విషయం గుర్తు చేసుకుంటుంది. మీరు నన్ను ప్రేమించినంతగా నేను మిమల్ని ప్రేమించలేను.. అందుకే మీకు దూరంగా వెళ్లిపోతున్నాను.. నా కడుపులో ఉన్న మీ వారసుడి గురించి కూడా మీకు చెప్పలేదు క్షమించండి.. నేను మిమల్ని చూడటం ఇదే చివరి సారి అని అనుకొని విహారి కాళ్లకి దండం పెట్టి బయటకు వెళ్లిపోతుంది.

లక్ష్మీ కోసం యమున, వసుధ చాలా కంగారు పడతారు. తర్వాత లక్ష్మీ యమున దగ్గరకు వెళ్లిన విషయం గుర్తు చేసుకుంటుంది. పడుకొని ఉన్న యమునని చూసి ఏడ్వడం గుర్తు చేసుకుంటుంది. వరసకు అత్త అయినా అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నావ్ అమ్మా.. ఆపదలో ఉంటే ఆదుకున్నావ్.. ఏం ఇచ్చి మీ రుణం తీర్చుకోగలను.. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత మిమల్ని మిస్ అవుతాను అని అనుకుంటుంది. యమున కాళ్లకి దండం పెట్టి వెళ్లిపోతుంది. చారుకేశవ, వసుధ పడుకొని ఉంటే తర్వాత వాళ్ల గదికి వెళ్లి బాబాయ్ పిన్ని నన్ను దత్తత తీసుకోవాలని చాలా ఆశ పడ్డారు నన్ను దత్తత తీసుకున్నా లేకపోయినా నేను మీ కూతురినే.. మరో జన్మ ఉంటే మీ కడుపులో మీ కూతురిగా పుడతాను అనుకుంటుంది. తర్వాత పండుని చూసి అన్నయ్యా ఒక కడుపులో మనం పుట్టకపోయిన నన్ను నీ సొంత చెల్లిలా చూసుకున్నావ్,.. నా కోసం ప్రాణం ఇవ్వడానికి అయినా వెనకాడవు.. నీ లాంటి అన్న ఉన్నందుకు నేను అదృష్టవంతురాలిని కానీ నాలాంటి చెల్లి ఉండటం నీ దురదృష్టం.. ఇక విహారి గారిని నువ్వే చూసుకోవాలి నేను వెళ్తున్నా తిరిగి రాను అని అనుకుంటుంది.

లక్ష్మీ ఎండలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. లక్ష్మీ కోసం పండు, చారుకేశవ, విహారి వెతుకుతూ ఉంటారు. కాళ్లకి చెప్పులు లేక మండుటెండలో లక్ష్మీ చాలా అవస్థలు పడుతుంది. దూరంగా ఓ బామ్మ టిఫెన్ కొట్టు చూసి లక్ష్మీ అక్కడికి వెళ్తుంది. లక్ష్మీ అక్కడికి వెళ్లి ఇడ్లీ ఎంత అని అడుగుతుంది. 30 రూపాయలు అని బామ్మ చెప్పగానే డబ్బులు కోసం చూస్తుంది. బ్యాగులో డబ్బులు లేకపోవడంతో టిఫెన్ చేయకుండా నీరు తాగుతుంది. అక్కడే కళ్లు తిరిగి పడిపోతుంది. బామ్మ చాలా కంగారు పడుతుంది. లక్ష్మీ నెల తప్పింది అని బామ్మకి తెలిసిపోతుంది. ఇక అక్కడే టిపెన్ చేస్తున్న ఇద్దరు రౌడీలు లక్ష్మీని చూస్తారు. బామ్మ లక్ష్మీకి లేపి కూర్చొపెడుతుంది. లక్ష్మీ వెళ్లిపోతాను అంటే బామ్మ టిఫెన్ ఇస్తుంది. వద్దు అని లక్ష్మీ అంటే నీ కోసం కాకపోయినా నీ కడుపులో బిడ్డ కోసం అయినా తిను అని అంటుంది. మీరు పెట్టే ఈ టిఫెన్‌కి డబ్బులు ఇవ్వలేకపోయినా దానికి తగ్గ పని చేస్తాను అని లక్ష్మీ అంటుంది. అక్కడే అన్న రౌడీలు లక్ష్మీ బ్యాగ్ మీద కన్నేస్తారు.

లక్ష్మీ తినేసి ఎంగిలి ప్లేట్లు కడుగుతుంది. లక్ష్మీ ఎక్కడికి వెళ్లింది అని బామ్మ చూసే సరికి లక్ష్మీ అంట్లు తోముతుంటుంది. అక్కడే ఉన్న ఇద్దరు రౌడీలు లక్ష్మీని అదోలా చూడటం బామ్మ చూస్తుంది. ఇక లక్ష్మీ వెళ్తాను అని చెప్పి వెళ్తుంది. లక్ష్మీ వెనకాలే ఆ రౌడీలు వెళ్తారు. ఇంట్లో యమున, వసుధ చాలా టెన్షన్ పడుతూ గుమ్మం వైపే చూస్తూ ఉంటారు. ఇంతలో పద్మాక్షి వాళ్లు వచ్చి లక్ష్మీ కోసం ఎంత హైరానా పడుతుందో చూశావా సహస్ర అని అంబిక, పద్మాక్షి సహస్రతో చెప్తారు. నా గురించి ఇలా ఎప్పుడైనా కంగారు పడ్డారా అత్తయ్యా.. అసలే నేను కడుపుతో ఉన్నాను కదా నా మంచి కోసం ఒక్క మాట అయినా చెప్పారా అని సహస్ర ఫైర్ అయిపోతుంది. సహస్ర అరిచి ఒక్క సారిగా కడుపు పట్టుకొని నొప్పి అని నటిస్తుంది. ఇంటి కోడలి మీద నీకు ఏం జాగ్రత్త లేదు కానీ పని మనిషి మీదే ఉంది అని అంటుంది. నువ్వు ఎంత అరిచి గోల పెట్టినా మీ అత్తయ్యా మారదు అని పద్మాక్షి అంటుంది. సహస్ర ఇంకెప్పుడూ ఇలా ఆవేశంగా మాట్లాడకమ్మా నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది.. అని అంటుంది. పని వాళ్లకి ఇచ్చే విలువ నాకు ఇవ్వరు అత్తయ్యా అని సహస్ర ఏడుస్తుంది.

రౌడీలు లక్ష్మీ వెంటపడి ఆపుతారు. బ్యాగ్ పట్టుకొని లాగితే నా దగ్గర డబ్బు లేదు అని లక్ష్మీ అంటే నీ దగ్గర డబ్బు లేదు అని మాకు తెలుసు కాసేపు మాతో ఉండు ఎంత కావాలో అంత ఇస్తామని రౌడీలు అనడంతో లక్ష్మీ వాళ్లని నెట్టిసి పరుగులు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.