GST Reduction: భారతదేశంలో GST 2.0 అమలులోకి వచ్చిన తర్వాత కాంపాక్ట్ SUV కొనడం మునుపటి కంటే చాలా చౌకగా మారనుంది. ప్రభుత్వం 28 శాతం పన్ను స్లాబ్‌ను తగ్గించి 18 శాతానికి తీసుకురావడంతో వినియోగదారులకు నేరుగా ఉపశమనం కలిగింది. ఇప్పుడు Maruti Suzuki Brezza, Hyundai Venue, Kia Sonet, Tata Nexon, Mahindra XUV 3XO వంటి ప్రసిద్ధ SUVలు మునుపటి కంటే చీప్‌గా వస్తాయి. వాటి ధరలు రూ. 30 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు తగ్గాయి. వివరంగా తెలుసుకుందాం.

మారుతీ బ్రెజ్జా(Maruti Suzuki Brezza)

మారుతి బ్రెజ్జాకు GST మార్పుల వల్ల స్వల్పంగా ప్రయోజనం చేకూరింది. ఇది 1.5-లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంది, దీనిపై గతంలో 45% పన్ను విధించగా, ఇప్పుడు అది 40%కి తగ్గించారు. ఫలితంగా, బ్రెజ్జా ధర ఇప్పుడు రూ. 30,000 నుంచి రూ. 48,000 వరకు తగ్గింది. కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.39 లక్షల నుంచి రూ. 13.50 లక్షల మధ్య ఉంది.

హ్యుందాయ్ వెన్యూ(Hyundai Venue)

Venue GST 2.0 ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందింది. గతంలో దీని పెట్రోల్ ఇంజిన్‌పై 29%, డీజిల్‌పై 31% పన్ను వేసేవాళ్లు. ఇప్పుడు రెండూ 18% స్లాబ్‌లోకి వచ్చాయి. దీని కారణంగా, Venue ధర రూ. 68,000 నుంచి రూ. 1.32 లక్షల వరకు తగ్గింది. కొత్త ధర ఇప్పుడు రూ. 7.26 లక్షల నుంచి రూ. 12.05 లక్షల వరకు ఉంది.

కియా సోనెట్(Kia Sonet)

Kia Sonet కూడా GST కోత నుంచి నేరుగా ప్రయోజనం పొందిన SUV. గతంలో దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15.74 లక్షల మధ్య ఉంది. ఇప్పుడు ఇది రూ. 70,000 నుంచి రూ. 1.64 లక్షల వరకు తగ్గింది. కొత్త ధర రూ. 7.30 లక్షల నుంచి రూ. 14.10 లక్షల మధ్య నిర్ణయించారు.

టాటా నెక్సాన్(Tata Nexon)

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటైన Nexon కూడా GST 2.0 ద్వారా ప్రభావితమైంది. గతంలో దీనిపై పెట్రోల్, డీజిల్ ఆధారంగా వేర్వేరు పన్నులు విధించేవాళ్లు, కానీ ఇప్పుడు అన్నింటికీ 18% స్లాబ్ వర్తిస్తుంది. దీని కారణంగా, Nexon ఇప్పుడు రూ. 68,000 నుంచి రూ. 1.55 లక్షల వరకు చౌకగా మారింది. కొత్త ధరలు రూ. 7.32 లక్షల నుంచి రూ. 13.88 లక్షల వరకు ఉంటాయి.

Mahindra XUV 3XO

Mahindra GST 2.0 అమలులోకి రావడానికి ముందే వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడం ప్రారంభించింది. సెప్టెంబర్ 6 నుంచి XUV 3XO ధరలను తగ్గించారు. ఇప్పుడు ఈ SUV రూ. 71,000 నుంచి రూ. 1.56 లక్షల వరకు చౌకగా మారింది. కొత్త ధర రూ. 7.28 లక్షల నుంచి రూ. 14.40 లక్షల వరకు ఉంది.

GST 2.0 కారణంగా కాంపాక్ట్ SUV విభాగంలో వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. ఇప్పుడు Nexon, Brezza, Venue, Sonet, XUV 3XO వంటి SUVలు మరింత సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. మీరు రాబోయే రోజుల్లో కొత్త SUV కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు సరైన సమయం కావచ్చు.