Chinni Serial Today Episode మధు డ్రస్ మీద లోహిత జూస్ పడేలా చేయడంతో మధు డ్రస్ క్లీన్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇక లోహిత కూడా మధు దగ్గరకు వెళ్తుంది. స్వప్నతో మధు మాట్లాడటం లోహిత విని ఏంటి ప్రపోజ్‌, మ్యాడీ అని వినిపించింది అని అంటుంది. అయినా అది నీ పర్సనల్ నాకు అవసరం లేదు కానీ నేను విన్న దాని ప్రకారం మ్యాడీ మరో అమ్మాయితో డీప్ లవ్‌లో ఉన్నాడు.. కాలేజ్ మొత్తం తెలుసు అని ఇలాంటి టైంలో నువ్వు చెప్పడం కరెక్టేనా.. ఇప్పుడు నువ్వు మ్యాడీకి ప్రపోజ్ చేస్తే నీ లవ్‌ అంగీకరించడు.. అప్పుడు మీ ఫ్రెండ్‌షిప్ కూడా పోతుంది అని అంటుంది.

ఉన్న ఫ్రెండ్‌షిప్ పోతుందని మధు మ్యాడీకి ప్రపోజ్ చేయను అని లోహితతో చెప్తుంది. బయటకు వచ్చి చూసే సరికి మ్యాడీ ఫొన్‌లో ఫొటో చూసుకుంటూ హ్యాపీగా ఉండటం చూసి మధు బాధ పడుతుంది. ఇంతలో మహి దగ్గరకు ఓ ఆర్టిస్ట్ వచమ్చి మహి డ్రాయింగ్ గీసి ఇస్తాడు. మహి చాలా బాగుందని చెప్తాడు. ఇక అతను ఈ పెయింటింగ్‌లో మీకు ఓ సర్‌ఫ్రైజ్ ఉంది అది చూస్తే మీరు హ్యాపీగా ఫీలవుతారు అని అంటాడు. మహి అది మధుకి చూపించి చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇక ఆ రెస్టారెంట్‌లో యాజమాన్యం అందరిని పిలిచి మీ మీద ఫోకస్ లైట్ వేస్తాం ఎవరి మీద పడితే వాళ్లు ఓ పాట పాడాలి అని అంటారు. ముందుగా మహి మీద లైట్ పడుతుంది.

మహి చాలా హ్యాపీగా నిన్ను కోరి మూవీలోని అడిగా అడిగా పాట పాడుతాడు. లోపల ఉన్న వరుణ్ పాట విని ఇది బావ వాయిస్ అని వెళ్తాడు. లోహిత మధుతో తను ప్రేమించిన అమ్మాయి కోసమే పాడుతున్నాడని అంటుంది. మధు ఏడుస్తూ అర్థమైంది లోహి మ్యాడీ తను ప్రేమించిన అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థమైంది అంటుంది. ఇక లోహిత, వరుణ్‌ పాట సూపర్ అని మ్యాడీ పొగిడేస్తారు. మహి మధు దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేసి తీసుకొచ్చి అందరూ బాగుంది అన్నారు నువ్వేం అనడం లేదు అంటే సూపర్ అని మధు అంటుంది. మ్యాడీ మధుతో నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తా అని అంటాడు.

మధు లోహిత మాటలు గుర్తు చేసుకొని బాధ పడుతుంది. మరోవైపు దేవా చిన్ని, బాలరాజులను ఎలా అయినా వెంటనే పట్టుకోవాలి ఇంకా వెతుకుతున్నా అంటే ఊరుకోను అని తన మనుషుకు వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో వల్లీ వస్తుంది. చిన్నిని ఎలా అయినా పట్టుకోవాలి.. లేదంటే శ్రేయ లైఫ్ నాశనం అయిపోతుందని అనుకుంటారు. చిన్ని నెంబరు దొరకడం లేదు అంటే ఏదో సీక్రెట్ ఉందని అంటుంది. దాంతో దేవా బాలరాజు చనిపోయాడని దశదిన ఖర్మ అని పేపర్‌లో వేయించు అప్పుడు ఎక్కడున్నా కచ్చితంగా చిన్ని బయటకు వస్తుందని అంటాడు. సూపర్‌ ఐడియా అని నాగవల్లి తన పీఏ నాయక్‌కి చెప్తుంది.

లోహిత వరుణ్‌తో ఏదో మాట్లాడాలి అన్నావ్ ఏంటి అని అంటుంది. ఏం లేదు అని వరుణ్అంటాడు. ఇంతలో శ్రేయ లోహితకు కాల్ చేసి గుడ్ న్యూస్ అని మా అన్నయ్యకి మ్యాచ్ ఫిక్స్ అయిందని అంటుంది. వాట్ అని లోహిత అరుస్తుంది. వరుణ్‌దగ్గరకు వెళ్లి స్పీకర్ ఆన్ చేసి విషయం అడుగుతుంది. సెంట్రల్ మినిస్టర్‌ కూతురికి అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిందని.. అన్నీ కుదిరితే నాకు బావకి కూడా అదే ముహూర్తానికి అవుతుందని అంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది పార్టీ చేసుకుందాం అని లోహిత చెప్పి తర్వాత కాల్ చేస్తా అంటుంది.

వరుణ్‌ని లోహిత నిలదీస్తుంది. ఆ మేటర్ చెప్పడానికే రమ్మని పిలిచాను అంటుంది. లోహిత ఏడుస్తూ నువ్వు ఎన్ని చెప్పినా వినను.. నేను నువ్వే కావాలి వదలను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా.. నువ్వు దక్కవు అని తెలిస్తే సూసైడ్ చేసుకుంటా అని అంటుంది. వరుణ్ లోహిత చేయి పట్టుకొని ఎవరు వద్దు అన్నా నేను నిన్నే ప్రేమిస్తున్నా నిన్నే పెళ్లి చేసుకుంటా అని అంటాడు. ఎలా నిన్ను నమ్మాలి వరుణ్ ఈరోజే నన్ను లవ్ చేస్తున్నా అని ఇంతలో పెళ్లి ఫిక్స్ అయింది అన్నావ్ అంటుంది. దాంతో వరుణ్ మోకాలి మీద కూర్చొని లోహిత చేతికి రింగ్ పెడతాడు. లోహిత చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇప్పుడు నమ్ముతావా అని వరుణ్ అంటే ఐలవ్‌యూ చెప్పి హగ్ చేసుకుంటుంది. మధుని మ్యాడీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మధు డల్‌గా ఉంటుంది. మ్యాడీకి బాయ్ చెప్పేసి ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.