'అఖండ 2 తాండవం' వాయిదా పడింది మొదలు ఈ క్షణం వరకు కొత్త విడుదల తేదీపై స్పష్టమైన సమాచారం లేదు. శివరాత్రి పండక్కి పరమేశ్వరుని ఆలయాలను అలంకరించినట్టు థియేటర్ల దగ్గర శివనామస్మరణ, బాలకృష్ణ నినాదాలు చేసేందుకు నందమూరి అభిమానులు సిద్ధమైన తరుణంలో విడుదలకు అడ్డంకులు ఎదురు అయ్యాయి. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు రిలీజ్ క్యాన్సిల్ అవ్వడం పెద్ద షాక్. ఈ తరుణంలో బాలకృష్ణ తాలూకా ఎవరు? 'అఖండ 2' పాలిట కింగ్ పిన్ ఎవరు అవుతారు? అని చర్చ మొదలైంది.

బాలకృష్ణ తాలూకా ఎవరు?
ఇటీవల రామ్ పోతినేని హీరోగా నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Taluka) విడుదలైంది. ఆ సినిమా కథ గుర్తుందా? తమ అభిమాన కథానాయకుడి వందో సినిమా చిక్కుల్లో ఉందని తెలిసి ఓ యువకుడు మూడు కోట్ల రూపాయలు హీరో అకౌంటులో వేస్తాడు. సినిమాను సమస్యల నుంచి గట్టెక్కిస్తాడు. తన కోసం అంత చేసిన అభిమాని కోసం రాజమండ్రి దగ్గరలోని లంక గ్రామాలకు వెళ్లి తన అభిమానితో 'నువ్వే అసలైన ఆంధ్ర కింగ్' అంటారు. అది రీల్ లైఫ్. ఇప్పుడు రియల్ లైఫ్ విషయానికి వస్తే... 'అఖండ 2' విడుదల చిక్కుల్లో పడింది. ఈ సినిమాను సమస్యల నుంచి గట్టెక్కించేది ఎవరు? అని నందమూరి - బాలకృష్ణ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.

బాలకృష్ణ తాలూకా ఎవరు? అని యావత్ ప్రేక్షక లోకం ఎదురు చూస్తోంది. ఇప్పుడు 'అఖండ 2'ను సమస్యల నుంచి గట్టెక్కించే కింగ్ పిన్ ఎవరు? బాలకృష్ణ సినిమాకు అసలు సిసలైన 'ఆంధ్ర కింగ్' ఎవరు? అనేది చర్చనీయాంశం అవుతోంది.

Also Read: 'అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?

'అఖండ 2' నిర్మాతలు, 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట - గోపి ఆచంటను సమస్యల నుంచి గట్టెక్కించడం కోసం ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగారు. ఇంకా కొంత మంది నిర్మాతలు సైతం లాబీయింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతానికి కొంత అమౌంట్ సర్దుబాటు చేశారు. కోర్టు కేసులు, ఫైనాన్షియర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూ క్లియర్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... అగ్ర నిర్మాత 'దిల్' రాజు కొంత అమౌంట్ ఏర్పాటు చేశారట. డబ్బు సర్దుబాటు చేయడం ఒక్కటే కాదు... సమస్యను సాల్వ్ చేయడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు. అయితే ఆయన ఇచ్చిన అమౌంట్ ఒక్కటే సరిపోదు. ఇంకా కావాలి. కానీ, దిల్ రాజు అంత అమౌంట్ అడ్జస్ట్ చేయడం గ్రేట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో ఖబర్. అగ్ర సురేష్ బాబు సహా మరికొంత మంది చర్చలు జరుపుతున్నారు. త్వరలో అవి ఓ కొలిక్కి వస్తాయని, 'అఖండ 2' థియేటర్లలోకి వస్తుందని ఆశిద్దాం. సమస్యలు అన్నీ క్లియర్ అయ్యాక విడుదల తేదీ ప్రకటించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కుదిరితే డిసెంబర్ 25 లేదా జనవరి 9న వచ్చే అవకాశాలు ఎక్కువ అని టాక్. సమస్యలు తీరిన తర్వాత తమకు అండగా నిలబడిన వాళ్ళకు నిర్మాతలు స్పెషల్ థాంక్స్‌ చెప్పనున్నారు.

Also Read: Akhanda 2 Vs Veeramallu: అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??