Attitude Star Chandrahas Coin Movie First Glimpse Out: బుల్లి తెర స్టార్ యాక్టర్ ప్రభాకర్ కుమారుడు, ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా 'కాయిన్' అనే డిఫరెంట్ టైటిల్‌తో మరో మూవీని అనౌన్స్ చేశారు. చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే 'బరాబర్ ప్రేమిస్తా' అంటూ చంద్రహాస్ ఆడియన్స్‌ను పలకరించనుండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

టైటిల్ గ్లింప్స్ రిలీజ్

'కాయిన్' మూవీకి జైరామ్ చిటికెల దర్శకత్వం వహిస్తుండగా... శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాయిన్ హైలైట్‌గా చుట్టూ బ్లేడ్స్, మేకులతో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి న్యూ టాలెంట్ రావాలని కోరుకుంటున్నట్లు డైరెక్టర్ సాయిరాజేష్ తెలిపారు. 'ప్రభాకర్ గారితో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. 'కాయిన్' చుట్టూ ఇంత జరిగిందా? అని కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. ట్రైలర్ వచ్చిన తరువాత చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతాయని నమ్మకంగా ఉన్నా. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

రియల్ లైఫ్ ఘటనలతో...

రియల్ లైఫ్ ఘటనలతో డైరెక్టర్ జైరామ్ ఈ మూవీని తెరకెక్కించనున్నారని హీరో చంద్రహాస్ అన్నారు. 'పాత 5 రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్ అనే పాయింట్లతో అద్భుతంగా కథను రాసుకున్నారు. ఆయన భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ అవుతారు. 'కాయిన్' ఫస్ట్ ఫ్లిప్‌ను లాంచ్ చేసేందుకు వచ్చిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. నిమిషి మ్యూజిక్ డైరెక్టర్‌గా పెద్ద స్థాయికి వెళ్తారు. కథ నచ్చితే ఏ జానర్ అన్నది ఆలోచించను. కథను, సినిమాల్ని పూర్తిగా నేనే ఓకే చేస్తాను. నాన్న అప్పుడప్పుడు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి, నన్ను ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పేందుకు నేను ఎప్పుడూ కష్ట పడుతూనే ఉంటాను.' అని అన్నారు.

Also Read: పొలిటికల్ ఎనిమీస్... పవర్ ఫుల్ రోల్స్ - పవన్ 'ఓజీ'లో ప్రకాష్ రాజ్ పోస్టర్ రిలీజ్

సమ్మర్‌లో రిలీజ్ చేస్తాం

5 రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయ్యింది? అనే నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ జైరాం తెలిపారు. 'మున్ముందు ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు చెబుతాను. మా ఫస్ట్ ఫ్లిప్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. హీరో చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ ఫ్లిప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాను. నేను చంద్రహాస్ చేసిన ఆర్ఆర్ఆర్ కవర్ సాంగ్‌ని చూశాను. అందులో అతని ఎనర్జీ చూసి ఈ కథను చెప్పాను. ఈ కథను నాకంటే ఎక్కువగా చంద్రహాస్ నమ్మారు. నిమిషి మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతోంది. సమ్మర్‌లో మా సినిమాని రిలీజ్ చేస్తాం.' అని అన్నారు.

ఈ మూవీలో తనకు ఛాన్స్ ఇచ్చిన జైరాంకు థాంక్స్ చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ నిమిషి జాకియాస్. 'చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. పగలు రాత్రి తేడా లేకుండా పని చేసి ఈ ఫస్ట్ ఫ్లిప్ కోసం వర్క్ చేశాం. ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ వస్తుంది.' అని చెప్పారు.