ARTICLE AD
LPG గ్యాస్ కొరత దేశ ప్రజలను భయపెడుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ నిల్వలు తరిగిపోతున్నాయి. ఇప్పటికే వాణిజ్య రంగానికి LPG గ్యాస్ పంపిణి నిలిపివేసింది కేంద్రం. గృహోపకరణాలకు మాత్రమే LPG గ్యాస్ సరఫరా చెయ్యాలని నిర్ణయించుకోవడంతో కమర్షియల్ గ్యాస్ దొరక్క పలు నగరాల్లో రెస్టారెంట్స్ బంద్ పెట్టారు. బెంగుళూరు, ముంబై, చెన్నై ఇప్పుడు హైదరాబాద్ లోను LPG గ్యాస్ కొరత తో హోటల్స్ మూతబడుతున్నాయి.
నిన్నటివరకు ఎలాగో మ్యానేజ్ చేసిన హోటల్ యజమానులు.. ఇక మావల్ల కాదు అని చేతులెత్తేశారు. కేవలం హోటల్స్ మాత్రమే కాదు ఈ LPG సిలిండర్ల కొరత వలన పెళ్ళిళ్ళు పేరంటాలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఎంత ఘనంగా పెళ్లిళ్లు చెయ్యాలనుకున్నా.. గ్యాస్ సలేకపోతే అక్కడ విందు ఉండదు. ఇది చాలా పెద్ద సమస్యే.
మూడు నెలల తర్వాత ఇప్పుడే మంచి రోజులు ఆరంభమవడంతో పెళ్లిళ్ల ముహుర్తాలు, గృహప్రవేశాలు, నూతన వస్త్రాలంకారణాలకు ముహుర్తాలు పెట్టుకున్నవారు ఈ LPG గ్యాస్ కొరత వలన వారికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఇరాన్ యుద్ధం వల్ల కేవలం గ్యాస్ మాత్రమే కాదు ఇతర విషయాల్లోనూ దేశ ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

2 months ago
11