హీరోని ముద్దులివ్వాల‌ని వేధించిన లేడీ నిర్మాత‌

2 months ago 3
ARTICLE AD

బ‌య‌ట‌కు క‌నిపించే ప్ర‌పంచం వేరు.. క‌నిపించ‌ని ప్ర‌పంచం వేరు! ఈ రెండో ప్ర‌పంచంలో చాలా గ‌మ్మ‌త్త‌యిన‌ విష‌యాలు ఉంటాయి.. విస్మ‌యానికి గురి చేస్తాయి. ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు త‌న కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక ఘ‌ట‌న గురించి షాకిచ్చే విష‌యాలు చెప్పాడు. అత‌డు అప్పుడ‌ప్పుడే క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు. రెండో హీరో మూడో హీరో పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. ఆ స‌మ‌యంలో ఆర్థికంగా కూడా వెసులు బాటు లేదు. అయితే ఇదే అద‌నుగా స‌ద‌రు హీరోని ఒక మ‌హిళా నిర్మాత వేధింపుల‌కు గురి చేసింది.

అత‌డికి చెల్లించాల్సిన పారితోషికాన్ని ముక్కలుగా చేసి, ప‌ది సార్లు త‌న వెంట తిప్పుకుంది. అంతేకాదు.. ప్ర‌తిసారీ అత‌డికి 1000 చెల్లించేది. అలా చెల్లించిన ప్ర‌తిసారీ ఆ హీరో త‌న బుగ్గ‌ల‌పై 10 ముద్దులు ఇవ్వాలి. మ‌హిళా నిర్మాతను వెయ్యి కోసం ఆ హీరో ఇష్టం ఉన్నా లేకున్నా అలానే భ‌రించేసాడ‌ట‌. కానీ త‌న కుటుంబం స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఎలా ఉండాలో నేర్పించిందని, నేను ఆ టైప్‌లో టైపిక‌ల్ హీరో త‌రహా కాద‌ని కూడా ఆ హీరో చెప్పాడు.

90ల‌లో న‌టుడిగా కెరీర్ ప్రారంబించిన అత‌డు మూడు ద‌శాబ్ధాల కెరీర్ లో ఎన్నో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో న‌టించి మెప్పించాడు. బాలీవుడ్ లో అగ్ర హీరోల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్నాడు. ఇటీవ‌ల తెలుగులోను ప్ర‌భాస్ లాంటి అగ్ర హీరోతో క‌లిసి న‌టించాడు. బాల‌కృష్ణ `అఖండ 2`లోను న‌టిస్తున్నాడు. మునుముందు సౌత్ లో భారీ ప్ర‌యోగాలు చేయ‌బోతున్నాడు. హిందీ ప‌రిశ్ర‌మ‌లోను బిజీగా కొన‌సాగుతున్నాడు.

Read Entire Article