IndiGo looks set to face severe financial losses: భారతదేశంలోని అతిపెద్ద లో-కాస్ట్ ఎయిర్‌లైన్ ఇండిగో కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల అమలు వల్ల డిసెంబర్ మొదటి వారంలో 2,000కి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో 5.86 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ కంపెనీ నిర్లక్ష్యంతో మూడీస్ రేటింగ్స్ వంటి గ్లోబల్ ఏజెన్సీలు "క్రెడిట్ నెగెటివ్" మారుతుదంని హెచ్చరికలు జారీ చేశాయి.

ఇండిగో సంక్షోభం పీక్ వింటర్ సీజన్‌లో జరిగడం వల్ల ఆర్థిక దెబ్బ తీవ్రంగా ఉంది. మూడీస్ రేటింగ్స్ ప్రకారం, విమానాల రద్దు వల్ల రెవెన్యూ నష్టం, రిఫండ్‌లు, కంపెన్సేషన్‌లు, DGCA పెనాల్టీలు ఆ సంస్థకు తీవ్ర నష్టాలను కలిగించనున్నాయి. డిసెంబర్ 7 నాటికి రూ. 610 కోట్లు రిఫండ్‌లు ప్రాసెస్ చేశారు. మొత్తం రిఫండ్‌లు రూ. 827 కోట్లకు చేరాయి. ఇంకా పెండింగ్ రిఫండ్‌లు, బ్యాగేజ్ డెలివరీలు ఉన్నాయి. ఇది క్వార్టర్లీ టాప్‌లైన్‌ను 5-7% తగ్గిస్తుందని నిపుణులు అంచనా.

సెప్టెంబర్ 2025 క్వార్టర్ లో ఇండిగో నెట్ లాస్ రూ. 2,614 కోట్లు రికార్డ్ చేసింది. డిసెంబర్ క్రైసిస్ వల్ల Q3 FY26లో రెవెన్యూ 17% పెరుగుదల ఉంటుందన్న ఆశలు కుప్పకూలాయి. ఫ్యూయల్ కాస్ట్‌లు, రూపాయి డెప్రిసియేషన్ వల్ల అదనపు భారం కనిపిస్తోంది. డిసెంబర్ 7న 1,650 విమానాలు ఆపరేట్ చేశారు. సాధారణంతో 2,200తో పోలిస్తే తక్కువ. డిసెంబర్ 10 నాటికి నార్మల్ అవుతుందని ఇండిగో చెప్పినప్పటికీ, పీక్ సీజన్ నష్టం రూ. 1,000-1,500 కోట్లకు చేరవచ్చు.

క్రైసిస్ వల్ల ఇంటర్‌గ్లోబ్ షేర్ ప్రైస్ పడిపోయింది. డిసెంబర్ 1 నుంచి 8 వరకు 13.5% డ్రాప్, మార్కెట్ క్యాప్ రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 1.94 లక్షల కోట్లకు తగ్గింది . రూ. 34,000 కోట్లు ఇన్వెస్టర్ల సొమ్ము తగ్గిపోయింది. డిసెంబర్ 8న 8-9% పడిపోయింది., 2022 ఫిబ్రవరీ తర్వాత అతి పెద్ద సింగిల్-డే లాస్. JM ఫైనాన్షియల్ రిడ్యూస్ రేటింగ్ ఇచ్చి, టార్గెట్ రూ. 4,000కి డౌన్ చేసింది . ఇన్వెస్టర్లు రెగ్యులేటరీ స్క్రూటినీ, రిఫండ్ లయబిలిటీలు, ఫ్యూయల్ కాస్ట్‌ల వల్ల భయపడ్డారు.

ఇండిగో పంక్చువాలిటీ & రిలయబిలిటీ బ్రాండ్‌గా ఉండి, 66% మార్కెట్ షేర్ కలిగి ఉంది. కానీ ఈ క్రైసిస్ దాని ఇమేజ్‌ను దెబ్బతీసింది. ఎయిర్‌పోర్టుల్లో క్యూస్, బ్యాగేజ్ డిలేలు, వన్-టైమ్ పెర్ఫార్మెన్స్ (OTP) 35% నుంచి 8.5%కి పడిపోయింది. ప్రయాణికులు అల్టర్నేటివ్ ఫ్లైట్‌లకు 10 రెట్లు ఫేర్‌లు చెల్లించాల్సి వచ్చింది . ఇండిగో సంస్త ఇప్పటికే రూ. 74,813 కోట్ల అప్పుల్లో ఉంది. క్రైసిస్ వల్ల ఒత్తిడి పెరిగుతుంది. రిఫండ్‌లు, పెనాల్టీలు అప్పుల భారాన్నిపెంచుతాయి. FDTL నిబంధనల వల్ల ఖర్చులు 25% పెరగవచ్చు. క్రైసిస్ వల్ల రీఫైనాన్సింగ్ కష్టం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ ఏర్పాటు చేశారు. కానీ ప్రయాణికుల నమ్మకాన్ని పెంచుకోవడం అంత తేలిక కాదని చెబుతున్నారు. మొత్తం మీద ఇండిగో తమ నెత్తి మీద తామే చేతులు పెట్టుకున్న చందంగా సంక్షోభాన్ని తెచ్చుకుంది.