హిట్ మెషిన్ కొత్త ప్ర‌యాణం స‌న్నాహాల్లోనా

1 month ago 6
ARTICLE AD

హిట్ మెషిన్ అనీల్ రావిపూడి టాలీవుడ్ లో ఇప్పుడు బంగారు బాతులాంటాడు. నిర్మాత‌లంతా అనీల్ తో సినిమాలు తీస్తే మంచి లాభాలు చూడొచ్చు? అడ్వాన్సులు గుమ్మ‌రించ‌డానికి రెడీగా ఉన్నారు. హీరోలు కూడా అనీల్ తో సినిమా చేయ‌డానికి అంతే ఆస‌క్తి చూపిస్తున్నారు. క‌మ‌ర్శియ‌ల్ గా  హిట్ అందుకోవాలంటే అనీల్ ను సేఫ్ జోన్ గా భావిస్తున్నారు.

అనీల్ దుర‌దృష్టం కొద్ది ప్ర‌భాస్, మ‌హేష్‌, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, బ‌న్నీ లాంటి స్టార్లు పాన్ ఇండియాలో సినిమాలు టార్గెట్ చేయ‌డంతో? అనీల్ ను వ‌దులుకోవాల్సి వ‌స్తోంది. లేదంటే వీరంతా అనీల్ తో ప‌ని చేయ‌డానికి పోటీ పడేవారు. దీంతో అనీల్ సీనియ‌ర్ స్టార్లు..త‌ర్వాత త‌రం హీరోల‌తో ప‌ని చేయాల్సి వ‌స్తోంది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే తాజాగా అనీల్ నిర్మాత‌గా కొత్త ప్ర‌యాణానికి రెడీ అవుతున్న‌ట్లు తెలిసింది. ఓ బ్యాన‌ర్ స్థాపించి భాగ‌స్వామ్యంలో సినిమాలు నిర్మించాల‌నుకుంటున్నాడుట‌.

ప్ర‌స్తుతం అనీల్ పారితోషికం ప్రాతిపదికిన ఇత‌ర బ్యాన‌ర్ల‌లో ప‌ని చేస్తున్నాడు.  దీంతో సినిమా భారీ హిట్ అయినా?  కేవ‌లం పారితోషికం త‌ప్ప లాభాలు రావ‌డం లేదు. వంద‌ల కోట్లు వ‌చ్చినా?  అందులో ఒక్క రూపాయి పై కూడా అనీల్ కు అధికారం ఉండ‌టం లేదు. కార్లు, బ‌హుమ‌తుల‌తోనే స‌రిపోట్టుకోవాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక‌పై పారితోషికం తీసుకోకుండా త‌న బ్రాండ్ నే బ్యాన‌ర్ రూపంలో  భాగ‌స్వామిగా మారే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు తెలిసింది. ఇదింకా ఆలోచ‌న ద‌శ‌లోనే ఉంద‌ని..కార్య‌రూపం దాల్చ‌డానికి ఇంకొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని విశ్వ స‌నీయ స‌మాచారం.

Read Entire Article