Hardik pandya and Shubman gill : భారతదేశంలో క్రికెట్ అభిమానులు చాలా మంది ఉన్నారు. వారిలో ఇద్దరు ఆటగాళ్ళ రాశి , నక్షత్రం ఒకటే. ఆ ఇద్దరు ఆటగాళ్ళు శుభ్‌మన్ గిల్ హార్దిక్ పాండ్యా, వీరు భారతదేశంలో విజయవంతమైన, ప్రసిద్ధ క్రికెటర్లలో ఒకరు.

శుభ్‌మన్ గిల్ సెప్టెంబర్ 8, 1999న జన్మించాడు

హార్దిక్ పాండ్యా అక్టోబర్ 11, 1933న జన్మించాడు

ఈ ఇద్దరు ఆటగాళ్ల రాశి కర్కాటకం ... ఇద్దరి నక్షత్రం కూడా ఆశ్లేష

ఆశ్లేష నక్షత్రం (Ashlesha Nakshatra) కర్కాటక రాశికి చెందినది. దీనికి అధిపతి బుధుడు (Mercury). ఈ నక్షత్రానికి సంబంధించిన జంతువు సర్పం (coiled serpent). ఇది మిస్టీరియస్, ఇంటెన్స్ , సైకలాజికల్ డెప్త్ ఉన్న నక్షత్రం. శుభ్‌మన్ గిల్ మరియు హార్దిక్ పాండ్యా ఇద్దరూ ఈ నక్షత్రంలో జన్మించినట్లు సోషల్ మీడియాలో ఉంది. ఓసందర్భంలో హార్దిక్ పాండ్యా దీనిని ధృవీకరించిన సమాచారం ఉంది.. కానీ శుభ్ మన్ గిల్ గురించి కొన్ని సోర్సుల్లో పూర్వ ఫల్గుని అని కూడా ఉంది...కొన్ని సోర్సుల్లో ఆశ్లేష అని ఉంది.

ఈ రాశి , నక్షత్రం కలిగిన వారు జీవితంలో చాలా విజయాలు సాధిస్తారట. వారు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే, వారు దానిని చేసి చూపిస్తారు. భారతదేశానికి చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్ళు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు

కర్కాటక రాశి - అశ్లేష నక్షత్రం కలిగిన వారి స్వభావం ఎలా ఉంటుంది!

ఈ నక్షత్రం , రాశి కలిగిన వారు చాలా తెలివైనవారు, ఆలోచనాపరులు. వారి మనస్సు, శరీరం రెండూ బలంగా ఉంటాయి. వారు ఏదైనా పనిని ఆలోచించి చేసే అలవాటు కలిగి ఉంటారు, దీని కారణంగా వారు ఎప్పుడూ విజయం సాధిస్తారు. అలాంటి వ్యక్తులు తమపై ఎలాంటి ఒత్తిడిని ఇష్టపడరు.
వారి స్వభావం కొంచెం మొండిగా ఉంటుంది, కానీ మనస్సు మంచిది. వారు ఏం ఆలోచిస్తారో అదే చేస్తారు. సంభాషణలో కూడా చాలా మంచివారు. కానీ వారి అతిపెద్ద బలహీనత వారి కోపం. క్రీడలు లేదా వ్యాపార రంగంలో వారు మంచి పేరు తెచ్చుకుంటారు. అందుకే శుభ్‌మన్ గిల్ , హార్దిక్ పాండ్యా క్రీడారంగంలో అధ్భుతంగా రాణిస్తున్నారు

వారి ప్రత్యేకతలు ఏంటి?

ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు స్నేహాన్ని నిలబెట్టుకోవడంలో చాలా నిజాయితీగా ఉంటారు. నమ్మదగినవారు. వారు తమ బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చడానికి అలవాటుపడతారు. వారి ప్రత్యేకత ఏంటంటే... వారు కష్టాలను ముందుగానే గ్రహించి, సమయానికి అప్రమత్తమవుతారు. వారి స్వభావం కారణంగా, వారు ఎవరినీ త్వరగా నమ్మరు, కాబట్టి మోసపోయే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం వారు మాట్లాడే కళ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సులభంగా ప్రజలకు తమ మాటలను అర్థం చేయించగలరు , ఒప్పించగలరు. వారు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా, దానిని సాధించడానికి పూర్తి దృఢ నిశ్చయంతో మరియు కష్టపడి పనిచేస్తారు. అందుకే వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు.

క్రీడారంగంలో ఆశ్లేష నక్షత్రం వారు తమ మానిప్యులేటివ్ , స్ట్రాటెజిక్ గుణాలతో గేమ్‌ను కంట్రోల్ చేస్తారు. వారి ఇంటెన్స్ నేచర్ వల్ల హై ప్రెషర్ సిట్యువేషన్లలో బాగా పెర్ఫార్మ్ చేస్తారు కానీ ఈగో , సస్పిషన్ వల్ల కాంట్రవర్సీలు వస్తాయి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.