స్మృతి మంధాన ఇన్ స్టా పోస్టులు డిలీట్

1 week ago 2
ARTICLE AD

ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం ఈపాటికి జరిగిపోయి ఆమె ఓ ఇంటిది అవ్వాల్సింది కానీ ఆమె తండ్రి అనారోగ్యం కారణముగా స్మృతి మందాన తన పెళ్లిని వాయిదా వేసుకుంది. తండ్రి ఆసుపత్రి పాలు కాకముందు స్మృతి మందాన తనకు కాబోయే భర్త పలాశ్‌ ముచ్చల్‌ తో కలిసి హల్దీ వేడుకలు, సంగీత్ వేడుకలు, మెహిందీ వేడుకల్లో పాల్గొంది. 

ఆ ఫోటోలను స్మృతి మంధాన తన సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేసింది. తండ్రి హాస్పిటల్ ఉండడమే కాదు అటు కాబోయే భర్త పలాశ్‌ ముచ్చల్‌ కూడా ఇన్ఫెక్షన్, ఎసిడిటి కారణంగా ఆసుపత్రిలో చేరడంతో స్మృతి మందాన వివాహం ఇప్పట్లో ఉండదు అనుకుంటున్న సమయంలో స్మృతి మంధాన తన అభిమానులను మరింత గందరగోళానికి చేసింది. 

తండ్రి హాస్పిటల్ లో చేరేముందు వరకు పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన స్మృతి మంధాన.. ఇప్పుడు వాటిని డిలీట్‌ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ఇన్‌స్టా ఖాతాలో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను తొలగించింది. 

అంతేకాకుండా స్మృతి మంధాన తన నిశ్చితార్ధం ఉంగరాన్ని చూపిస్తూ తన టీమ్‌మేట్స్‌తో చేసిన ప్రత్యేక వీడియోని కూడా ఇన్‌స్టా ఖాతా నుంచి తొలగించింది. అసలు స్మృతి ఆ ఫొటోస్ ని ఎందుకు డిలేట్ చేసిందో తెలియక ఆమె అభిమానులు కన్ఫ్యూజన్ లోకి వెళుతున్నారు. 

Read Entire Article