స్పిరిట్: ప్రభాస్ కి కళ్ళు చెదిరే పారితోషికం

8 hours ago 1
ARTICLE AD

పాన్ ఇండియా స్టార్స్ లో ప్రభాస్ కి ఉండే క్రేజే వేరు. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ కి క్రేజ్ తో పాటుగా పారితోషికం పెగిపోయింది. రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి డిజాస్టర్స్ ఉన్నా ఆయనతో సినిమాలు చెయ్యడానికి, ఆయన అడిగింది ఇచ్చేందుకు ఏ నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. 

అసలే సలార్, కల్కి లాంటి భారీ విజయాల తర్వాత ప్రభాస్ కొస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ చూస్తే ఫ్యాన్స్ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వచ్చే ఏడాది రాజా సాబ్, ఫౌజీలతో ట్రీట్ ఇవ్వబోతున్న ప్రభాస్ రీసెంట్ గానే సందీప్ వంగ స్పిరిట్ సెట్ లోకి అడుగుపెట్టారు. అయితే గతంలో ప్రభాస్ 100 కోట్లు 120 కోట్లు పారితోషికం అందుకున్నారనే ప్రచారం ఉంది. 

ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ చిత్రానికి కళ్ళు చెదిరే పారితోషికం డిమాండ్ చెయ్యగా మేకర్స్ ఎలాంటి ఆలోచన చెయ్యకుండా అయన అడిగింది ఇచ్చేస్తున్నారట. స్పిరిట్ కి ప్రభాస్ ఏకంగా 160 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంటే ఆయన అభిమానులు ఇది కదా మా ప్రభాస్ రేంజ్ అంటున్నారు. 

స్పిరిట్ కి ప్రభాస్ పారితోషికమే ఇంత అంటే.. స్పిరిట్ బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటేనే  చెక్కెర వస్తుంది అంటూ నెటిజెన్స్ సరాదాగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న స్పిరిట్ సినిమాకు 6 నెలల కాల్షిట్లు కేటాయించాడట ప్రభాస్. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఓ భారీ షెడ్యూల్ మెక్సికోలో ఉంటుంది అని సమాచారం. 

Read Entire Article