సల్మాన్-అట్లీ ఎక్కడ చెడింది

9 months ago 8
ARTICLE AD

ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అట్లీ తన తదుపరి సినిమాను ఎవరితో చేయనున్నాడో అనే ఉత్కంఠ ఎట్టకేలకు ముగిసినట్టే కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ అల్లు అర్జున్ అనే రెండు పెద్ద పేర్లు వినిపించినప్పటికీ చివరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌దే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ముంబై వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి ముందు చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయని సమాచారం.

అట్లీ తొలుత సల్మాన్ ఖాన్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక పవర్‌ఫుల్ కథ సిద్ధం చేసుకున్నాడట. కానీ ఈ సినిమాకు కేవలం ప్రొడక్షన్ కోసమే 400 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేయడంతో జియో స్టూడియోస్ ఈ ప్రాజెక్టును తిరిగి పరిశీలించాలనే నిర్ణయానికి వచ్చిందట. సల్మాన్ ఖాన్‌పై ఇంత భారీ బడ్జెట్ పెట్టడం సురక్షితమా ? అనే సందేహంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

అట్లీ తర్వాత ఈ కథను సన్ పిక్చర్స్‌కు వినిపించగా అక్కడ కూడా ఇదే విధంగా స్పందన వచ్చింది. సల్మాన్‌పై ఇంత భారీ పెట్టుబడి పెట్టడం కష్టమని భావించి తాత్కాలికంగా ప్రాజెక్టును నిలిపివేసినట్టు సమాచారం. కానీ అదే స్క్రిప్ట్‌తో అల్లు అర్జున్‌ను సంప్రదించగా ఆయనపై ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు స్టూడియోలు సిద్ధంగా ఉన్నాయనే సంకేతాలు అందాయి.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా కోసం రెడీ అవుతున్న బన్నీ ఆ ప్రాజెక్టు ఆలస్యమైతే అట్లీ సినిమాకు ఓకే చెప్పే అవకాశముందట. అల్లు అర్జున్ మార్కెట్ పుష్ప ఫ్రాంచైజీ క్రేజ్ దృష్టిలో ఉంచుకుని సన్ పిక్చర్స్ కూడా ఈ భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు గానీ ఈ ప్రాజెక్టు ఖరారైనట్టు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇది టాలీవుడ్ స్థాయి బాలీవుడ్‌ను మించేలా ఎదుగుతోందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మారింది. అయితే సల్మాన్ ఖాన్ అట్లీ కాంబినేషన్ పూర్తిగా క్యాన్సిల్ అయ్యిందని కాదు. పెద్ద బడ్జెట్ అవసరం లేకుండా మరో ప్రాజెక్ట్‌ను రూపొందించే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

మొత్తానికి అల్లు అర్జున్ అట్లీ కాంబోలో ఓ భారీ సినిమా రాబోతుందనే ఊహాగానాలు ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. పుష్ప 2 ది రూల్ విడుదలై రెండు నెలలు దాటిపోతున్నా కొత్త ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావడం లేదు. అందుకే బన్నీ అభిమానులు కొత్త సినిమా ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Entire Article