సమ్మర్ లో సమంత దర్శనం

1 month ago 6
ARTICLE AD

చాలా రోజుల తర్వాత సమంత నుంచి ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మా ఇంటి బంగారం రాబోతుంది. ఓ బేబి వంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత మ‌రోసారి సమంత‌, నందిని రెడ్డి కాంబోలో రానున్న ఈ సినిమాను రాజ్ నిడిమోరు రూపొందిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా మే15న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంటే సమ్మర్ లో సమంత దర్శనం ఉండబోతుంది.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా మా ఇంటి బంగారం సినిమాను యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. యాక్ష‌న్ డ్రామా మూవీ అంద‌రికీ నచ్చేలా, అన్ని అంశాల‌తో రూపొందుతోంది. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను బ‌ల‌మైన భావోద్వేగాల‌తో పాటు ఉత్కంఠ‌త‌ను రేపే యాక్ష‌న్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ డైరెక్ట‌ర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.

చిత్ర యూనిట్ లేటెస్ట్‌గా స‌మంత ఉన్న కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది, ఇది సినిమాకి ప్రత్యేకమైన విజువల్ లుక్‌ను తీసుకొచ్చింది. ఇది యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం సమంత శారీరకంగా సిద్ధమైన తీరుని హైలైట్ చేస్తోంది.  

Read Entire Article