సంక్రాంతి త‌ర్వాత సొంత ప‌రిశ్ర‌మ‌ల్లో

1 day ago 1
ARTICLE AD

ఐకాన్  స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి  తెలిసిందే. బ‌న్నీ ని ఏకంగా గ్లోబ‌ల్ స్థాయిలో నిల‌బెట్టేలా అట్లీ ప్ర‌ణాళిక సిద్దం చేసి ముందుకెళ్తున్నాడు. సినిమా కోసం హాలీవుడ్ స్టూడియోల్నే రంగంలోకి దించాడు. బ్యాకెండ్ లో అమెరికా స్టూడియోలు ప‌నిచేస్తున్నాయి. ఇక ఈ సినిమా సూటింగ్ ముంబైలో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌లుగా షూటింగ్ అక్క‌డే జ‌రుగుతోంది.

అక్క‌డ నుంచి బ‌న్నీ-అట్లీ ఎటూ క‌ద‌ల‌కుండా ప‌ని చేస్తున్నారు. ఇంత వ‌ర‌కూ చెన్నై, హైద‌రాబాద్ వైపు చూసింది లేదు. క‌థ‌కు త‌గ్గ అన్ని ర‌కాల వ‌సుతులు ముంబైలో ఉండ‌టంతో?  అక్క‌డే చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు. టెక్నిక‌ల్ స్టోరీ కావ‌డంతో?  భారీ సెట్లు నిర్మించి షూటింగ్ చేస్తున్నారు. అవ‌స‌రం మేర ముంబై ఔట‌ర్ లో ఔట్ డోర్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. మ‌రి చెన్నై, హైద‌రాబాద్ లో షూటింగ్ ఎప్పుడు? అస‌లు ఆ రెండు చోట్లా షూటింగ్ ప్లానింగ్ ఉందా?  లేదా? అంటే ఉంద‌నే వెలుగులోకి వ‌చ్చింది.

సంక్రాంతి త‌ర్వాత రామోజీ ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్ ఉంటుందిట‌. ఈ షెడ్యూల్ కొన‌సాగింపుగానే  చెన్నైలోని కొంత భాగం షూటింగ్ నిర్వ‌హిస్తార‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి  తెలిసింది. అనంత‌రం ముంబైలో కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించి విదేశాల‌కు ప‌య‌నం కానున్నారుట‌. దీనిలో భాగంగా ర‌ష్యాలో కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించాల్సి ఉందిట‌. ర‌ష్యా వెళ్లేందుకు ఏర్పాట్లు  కూడా జ‌రుగుతున్నాయ‌ని తెలిసింది. `పుష్ప ది రైజ్` ని ర‌ష్యా లో రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

మాస్కో ఇంటర్నేష‌న‌ల్  ఫిలిం పెస్టివ‌ల్స్ లో ప్ర‌ద‌ర్శించారు.  ఆస‌మ‌యంలో డ‌బ్బింగ్ వెర్ష‌న్ కూడా ర‌ష్యాలో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించి రిలీజ్ చేసారు. ప్ర‌చారంలో భాగంగా టీమ్ ర‌ష్యా కూడా వెళ్లారు. తాజాగా బ‌న్నీ కొత్త సినిమా షూటింగ్ ని ర‌ష్యాలో కూడా ప్లాన్ చేస్తున్నారంటే?  అట్లీ అక్క‌డ రిలీజ్ వెనుక మాస్ట‌ర్ ప్లాన్ వేసాడా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.    

Read Entire Article