వైసీపీలో ఇప్పుడేం జరగబోతుంది

10 months ago 8
ARTICLE AD

వైయస్ జగన్ ఇప్పుడేం చేయబోతున్నారు. వైసీపీలో జరుగుతున్న అనూహ్య పరిణామాలపై ఆయన ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు. తాను లేనప్పుడు రాజీనామా చేసిన విజయ్ సాయి రెడ్డి విషయంలో ఎలా స్పందించబోతున్నారు. సాయి రెడ్డి రాజీనామా తర్వాత ఆయన ప్లేస్‌లో ఎవరిని నిలబెట్టబోతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీ కార్యకర్తల మైండ్స్‌ని ప్రశాంతంగా ఉండనీయని అంశం. కారణం జగన్ లండన్ ట్రిప్ ముగించుకుని తాజాగా బెంగుళూరులో అడుగుపెట్టారు. 

జనవరి 14న జగన్ తన భార్య భారతితో కలిసి లండన్‌కు వెళ్లారు. అక్కడ తమ కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. తాజాగా ఆయన లండన్ నుంచి బెంగుళూరు‌కి వచ్చేశారు. విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఇక ఫిబ్రవరి 3 న ఆయన తాడేపల్లి నివాసానికి వచ్చే అవకాశం ఉంది. 

అయితే వైసీపీలో ఇప్పడేం జరగబోతుంది అనే విషయంలో కార్యకర్తల్లో చాలా క్యూరియాసిటీ ఉంది. జగన్ ఇక్కడలేని సమయంలో ఏవేవో జరిగిపోయాయి. ఆయన వచ్ఛాక పరిస్థితి ఎలా ఉంటుంది. అసలే పేర్ని నాని, కొడాలి నాని కనిపించడం లేదు. జగన్ వచ్చాకే అధికార ప్రతినిధి రోజా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితిల్లో జగన్ ఏం చేస్తారో కాస్త వేచి చూడాల్సిందే. 

Read Entire Article