ముగ్గురు భార్య‌ల‌తో స్టార్ హీరో ఫుల్ హ్యాపీ

1 hour ago 1
ARTICLE AD

మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్ 60 వ‌య‌సులో బెంగ‌ళూరు యువ‌తి గౌరీ స్ప్రాట్ తో డేటింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అత‌డు త‌న లైఫ్ లోకి వ‌చ్చిన ముగ్గురు భార్య‌లు అద్బుతం అని పొగిడేస్తున్నాడు. త‌న మాజీ భార్య‌ల‌తో ఎప్ప‌టికీ తాను స్నేహం కొన‌సాగిస్తున్నాన‌ని, ఆ ఇద్ద‌రూ త‌న‌కు మంచి స్నేహితులు అని అమీర్ అన్నాడు.

``రీనా అద్భుతమైన వ్యక్తి. మేము భార్యాభర్తలుగా విడిపోయినా కానీ, మనుషులుగా విడిపోలేదు. నా హృదయంలో ఆమె పట్ల చాలా ప్రేమ, గౌరవం ఉంది. నేను ఆమెతో పెరిగాను.. ఆమె అద్భుతమైన వ్యక్తి. మేం విడిపోయినప్పుడు మనుషులుగా విడిపోలేదు. కిరణ్ విషయంలో కూడా అంతే. ఆమె అద్భుతమైన వ్యక్తి. మేం భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. కానీ మేము ఇప్ప‌టికీ ఒక‌ కుటుంబం. రీనా, ఆమె తల్లిదండ్రులు, కిరణ్- ఆమె తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు మేమంతా నిజానికి ఒకే కుటుంబం`` అని అన్నారు.

60 ఏళ్ల వయసులో మ‌ళ్లీ ప్రేమలో ప‌డ‌టంపైనా అమీర్ ఖాన్ మాట్లాడారు. ఈ సంవత్సరం ప్రారంభంలో తన 60వ పుట్టినరోజున స్నేహితురాలు గౌరీని మీడియాకు పరిచయం చేసిన సంగ‌తి తెలిసిందే. మళ్ళీ రిలేష‌న్ షిప్‌లోకి వస్తానని ఎప్పుడైనా అనుకున్నారా? అని ప్ర‌శ్నించ‌గా అమీర్ ఇలా అన్నాడు. ``లేదు, నేను అనుకోలేదు. నా భాగస్వామి కాగల వ్యక్తి నాకు దొరకకపోవచ్చు అనే స్థితికి చేరుకున్నాను. నేను దానిని ఊహించలేదు. ఆమె చాలా ప్రశాంతతను, స్థిరత్వాన్ని తెస్తుంది. ఆమె నిజంగా అద్భుతమైన వ్యక్తి, నేను ఆమెను కలవడం చాలా అదృష్టం. నా వివాహాలు విజయవంతం కాకపోయినా, నా జీవితంలో రీనా, కిరణ్ ల‌ను క‌ల‌వ‌డం, ఇప్పుడు గౌరీని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఒక వ్యక్తిగా నా ఎదుగుద‌ల‌కు దోహదపడ్డారు. నేను వారిని అనేక విధాలుగా గౌరవిస్తాను`` అని అన్నారు.

Read Entire Article