వెట్రి మారన్ మండాడి షూటింగ్ లో ప్రమాదం

2 months ago 3
ARTICLE AD

సుహాస్, సూరి కలయికలో తమిళ్ డైరెక్టర్ వెట్రి మారన్ తెరకెక్కిస్తున్న మండాడి సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సుహాస్, సూరి కలసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా మండాడి షూటింగ్ చేస్తున్న సమయంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. 

చెన్నై సముద్రం లో సినిమా షూటింగ్ చేస్తున్న టైమ్ లో మండాడి టెక్నీకల్ టీమ్ వున్న పడవ ఒక్కసారి గా సముద్రంలో బోల్తా పడిపోయింది, ఆ పడవలో ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు కెమెరా లు సముద్రంలో పడిపోవడంతో.. అలెర్ట్ అయిన చిత్ర బృందం ఆ ఇద్దరు వ్యక్తులను కాపాడినట్లుగా తెలుస్తుంది. 

కానీ ఆ పడవలో ఉన్న కెమెరాలు ఇతర సామాగ్రి మాత్రం సముద్రం లో  కొట్టుకుపోయినట్లుగా చెబుతున్నారు. యూనిట్ సభ్యులెవరికి ప్రమాదం జరగకుండా సేవ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Read Entire Article