విశాఖ సమ్మిట్‌ లో నారా లోకేష్ కీలక పాత్ర

3 weeks ago 2
ARTICLE AD

విశాఖలో రెండో రోజు సీఐఐ సమ్మిట్‌ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అనేక పారిశ్రామిక రంగాలలో భారీ పెట్టుబడులను నమోదు చేసింది. సీఐఐ సమ్మిట్‌ విజయవంతంగా కొనసాగడానికి కృషి చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఒకరు. ఏపీలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకోవడంలో వాటిని సమన్వయపరచడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.

ఈ సదస్సులో ఏపీ ని ఇన్నోవేషన్ల హబ్‌గా, దేశానికి టెక్ రాజధానిగా తీర్చిదిద్దుతామని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అన్నదే తమ ప్రభుత్వ దార్శనికత అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలు, పెట్టుబడిదారులను ఇది ఒకే వేదికపైకి తెస్తుందన్నారు. స్టార్టప్‌లకు ప్రభుత్వమే తొలి కస్టమర్‌గా ఉంటుందని, ప్రభుత్వ సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు హ్యాకథాన్‌లు నిర్వహిస్తామని ఈ సందర్భంగా నారా లోకేష్ హామీ ఇచ్చారు.

ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని ఇంకా మరిన్ని పెట్టుబడులు తాము పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ సమ్మిట్ లో మంత్రి లోకేశ్‌ సమక్షంలో 6 సంస్థలతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా SYRMA SGS మేనేజింగ్ డైరెక్టర్ జస్బీర్ ఎస్ గుజ్రాల్ లోకేష్ గురించి ప్రశంసలు కురిపించారు

ఏపీ లో ప్రతిభావంతమైన వ్యాపార అభివృద్ధిని సాధించడంలో మంత్రి నారా లోకేష్ పాత్రను ఈ సదస్సులో పలువురు అగ్ర వ్యాపార దిగ్గజాలు మరియు కార్పొరేట్ నాయకులు ప్రశంసించారు.

Read Entire Article