ARTICLE AD
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కష్టాల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్నారు. ఒక పక్క సినిమా కష్టాలు, మరోపక్క రాజకీయ సమస్యలు, ఇంకోపక్క భార్య విడాకుల కేసు. విజయ్ ని కష్టాలు పలకరించడం కాదు, కష్టాలే విజయ్ ని పలకరిస్తున్నాయి. సంక్రాంతికి థియేటర్స్ లోకి రావాల్సిన విజయ్ చివరి చిత్రం జన నాయకన్ సమస్యల వలయంలో చిక్కుకుంది.
సెన్సార్ ప్రోబ్లెంస్ తో జన నాయకన్ విడుదలకు ఆటంకం ఏర్పడింది. ఆతర్వాత అభిమానుల ఒత్తిడి, అలాగే జన నాయకన్ ఓటీటీ డీల్ చేసుకున్న అమెజాన్ ప్రైమ్ ఒత్తిడి తో నిర్మాతలు సతమతమవుతున్నారు. జన నాయకన్ విడుదల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. అందుకే అమెజాన్ ప్రైమ్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.
జన నాయగన్ ఓటీటీ హక్కులను రద్దు చేసుకుంది డిజిటల్ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్. అమెజాన్ ప్రైమ్ సుమారు రూ.120 కోట్లుకు జననాయకన్ డిజిటల్ హక్కులు కొనుగోలు చెయ్యగా.. అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోవడంతో, సినిమాకు సెన్సార్ దిల్ అవడంతో ఓటీటీ డీల్ నుంచి అమెజాన్ ప్రైమ్ వైదొలిగినట్టుగా తెలుస్తుంది.
పాపం విజయ్ చివరి సినిమా అంటూ గొప్పగా అనౌన్స్ చేసిన సినిమా ఇలా సీరియల్ కష్టాలతో సతమతమవడం ఆయన అభిమానులు కలిచివేస్తుంది.

1 month ago
5