విజయ్ లైఫ్ లో ఈరోజు ఏం జరగబోతుంది

1 hour ago 1
ARTICLE AD

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి ఆయన భార్య సంగీత విడాకులు ఇచ్చేందుకు సిద్దమై చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ కి ఈ విడాకుల దెబ్బ మామూలుది కాదు. విజయ్ ఒక నటితో క్లోజ్ గా ఉంటున్నాడు అంటూ సంగీత విడాకుల పిటిషన్ వేసింది.

అంతేకాదు భరణం కింద రూ.250 కోట్లు డిమాండ్ చేసింది అనే టాక్ ఉండగా.. కొడుకు, కుమార్తె మెయింటినెన్స్ కూడా విజయ్ చూసుకోవాలని, విజయ్ తో తనకు విడాకులు వచ్చేవరకు విజయ్ కు చెందిన చెన్నై నీలాంగరైలో ఉన్న ఇంట్లోనే ఉండనివ్వాలని ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. 

అయితే ఏప్రిల్ 20 సోమవారం అంటే ఈరోజు చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విజయ్-సంగీత విడాకుల కేసు విచారణలోకి రానుంది. అది అలా ఉండగా విజయ్ ఇరు లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని, కోర్టు బయటే సంగీత తో విడాకుల కేసు సెటిల్మెంట్ కు విజయ్ ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగా రూ.35 కోట్ల సెటిల్మెంట్ కి విజయ్ ఒప్పుకున్నారని.. కొడుకు, కూతురు సంరక్షణ విజయ్ తీసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తుంది.

మరి ఈరోజు చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విజయ్-సంగీత ల విడాకుల కేసు విచారణపై అందరిలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. 

Read Entire Article