వారానికే చేతులెత్తేసిన ఉస్తాద్

2 weeks ago 3
ARTICLE AD

మార్చ్ 19 గురువారం ఉగాది, రంజాన్ స్పెషల్ గా థియేటర్స్ లో విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం వారం తిరగకుండానే చేతులెత్తేసింది. మొదటి రెండు రోజులు పర్లేదు అనిపించినా కలెక్షన్స్ మాత్రం వీకెండ్ లోనే తగ్గిపోయాయి. వీక్ డేస్ మొదలయ్యేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ ఖాళీగా దర్శనమివ్వడమే కాదు.. ధురంధర్ 2 కోసం కొన్ని థియేటర్స్ పెంచేశారు.

హరీష్ శంకర్ ఇంకా ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. సినిమా బావుంది, ఫ్యాన్స్ మెచ్ఛారు, పవన్ కి నచ్చింది అంటూ హీరోయిన్ శ్రీలీల తో కలిసి అడిగినోళ్ళకి, అడగనోళ్లకి ఇంటర్వూస్ ఇస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. సినిమాలో కంటెంట్ లేదు, కేవలం పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ పై రెండున్నర గంటలు ఆడియన్స్ ఎంగేజ్ చెయ్యడం కష్టమనే విషయం హారిష్ కి తెలీయదా..

కొంతమందికి ఉస్తాద్ భగత్ సింగ్ నచ్చినా.. అందరిలో ధురంధర్ 2 చూడాలనే కోరిక బలంగా ఉండడము ఉస్తాద్ భగత్ సింగ్ కి బ్రేకులు వేసింది. ఈ వారం చిన్న సినిమాలు విడుదలయ్యాయి, అందులో ఏది ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యలేదు, అయినప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ చూసేందుకు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కనిపించకపోవడం గమనార్హం. 

Read Entire Article