ARTICLE AD
జనవరి నుంచి ఊరించి ఊరించి దర్శకధీరుడు రాజమౌళి ఎట్టకేలకు నవంబర్ 15 #GlobeTrotter ఈవెంట్ లో మహేష్ అభిమానులకే కాదు ప్రపంచ వ్యాప్త మూవీ లవర్స్ కి సూపర్ స్టార్ మహేష్ తో తను చేస్తున్న మూవీ టైటిల్ తో పాటుగా మహేష్ లుక్ ని ఆయన కేరెక్టర్ ని రివీల్ చేస్తూ రామోజీ ఫిలిం సిటీలో చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
#GlobeTrotter ఈవెంట్ కి మహేష్ ఆయన భార్య నమ్రత, కుమార్తె సితార, ప్రియాంక చోప్రా, విలన్ పాత్రధారుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా SSMB 29 టెక్నీకల్ టీమ్ మొత్తం హాజరయ్యారు. ఇక ఈవెంట్ లో మహేష్ లుక్ ని ఆయన కేరెక్టర్ ని పరిచయం చేస్తూ వారణాసి టైటిల్ గ్లింప్స్ ని బిగ్ స్క్రీన్ పై రివీల్ చేసారు. మహేష్ రుద్ర గా పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు.
ఎద్దు మీద మహేష్ వస్తూ రుద్రా గా విశ్వరూపం చూపించాడు అంటూ అభిమానులే మాట్లాడుకుంటున్నారు. మరి ఇన్ని నెలల నిరీక్షణకు రాజమౌళి ఇంత పెద్ద ఈవెంట్ తో సరైన ట్రీట్ తో అభిమానుల మొత్తాన్ని కూల్ చేసారు.

2 weeks ago
2