వారణాసి - రాజమౌళి ప్లానింగ్ ఊహాతీతం

1 month ago 6
ARTICLE AD

దర్శకధీరుడు రాజమౌళి తను తెరకెక్కించే సినిమాలని ఎంత బాగా చెక్కుతారో, అంతే బాగా ప్రమోషనల్ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం ఆయన చెక్కుతున్న వారణాసి చిత్రం టైటిల్, అండ్ మిగతా అప్ డేట్ అనౌన్సమెంట్ నే #GlobeTrotter ఈవెంట్ అంటూ హాలీవుడ్ ని టచ్ చేసారు.

ఆతర్వాత కాశీ లో రిలీజ్ డేట్ పోస్టర్స్ వేసి సర్ ప్రైజ్ చేశారు. ఇప్పుడు మరోసారి వారణాసి ని గ్లోబల్ వైడ్ గా ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వారణాసి తొలి గ్లోబల్ ప్రజెంటేషన్ కోసం మెక్సికో వేదిక కానుంది. రేపు శుక్రవారం మెక్సికో లో జరగబోయే ప్రతిష్ఠాత్మక CCXP 2026 ఈవెంట్‌లో వారణాసి కోసం ఒక ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. 

ఈ ఈవెంట్ తోనే వారణాసి ఇంటర్నేషనల్ ప్రమోషన్లు అఫీషియల్ గా మొదలు కాబోతున్నాయి. ఈ కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ వీడియోలను ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా వారణాసి మేకింగ్ విశేషాలను చిత్ర బృందం అక్కడి ప్రేక్షకులతో పంచుకోనుంది. ఈ కార్యక్రమంలో రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటారని తెలుస్తుంది.  

Read Entire Article