న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మూడో వన్డేలో 43 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది. దీంతో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో కంగారూ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా 412 పరుగుల భారీ స్కోరు చేసింది. రికార్డు పరుగుల ఛేజింగ్ కు దిగిన భారత జట్టు 369 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో స్మృతి మంధానా (125 పరుగులు) సెంచరీ సాధించింది. కానీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయింది.

413 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన భారత జట్టుకు శుభారంభం దొరకలేదు. టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్ 10 పరుగులు చేసి ఔట్ అయింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా ఒక ఎండ్ లో పరుగుల వరద పారించినా మరో ఎండ్ నుండి వికెట్లు వరుసగా పడిపోయాయి. హర్లీన్ డియోల్ కూడా 11 పరుగులు చేసి అవుట్ అయింది.

Virat Kohli 🤝 Smriti Mandhana. 🇮🇳 pic.twitter.com/Nlz4fRgIOy

— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2025

మ్యాచ్ లో 781 పరుగులు, 111 బౌండరీలు

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో మొత్తం 781 పరుగులు నమోదయ్యాయి. రెండు జట్లు కలిపి మొత్తం 99 ఫోర్లు, 12 సిక్సర్లు కొట్టాయి. అంటే మ్యాచ్ లో మొత్తం 111 బౌండరీలు నమోదయ్యాయి. మొదట ఆస్ట్రేలియా జట్టు 60 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టింది. ఆ తర్వాత టీమ్ ఇండియా కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 39 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టింది. ఈ విధంగా ఇరు జట్ల బ్యాట్స్ మెన్ లు కలిసి 111 బౌండరీలు బాది హల్ చల్ చేశారు.

అప్డేట్ కొనసాగుతోంది...