రేవతి ఫ్యామిలీకి మైత్రి హెల్ప్

11 months ago 8
ARTICLE AD

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కొడుకు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆసుపత్రిలో ఉన్న శ్రీ తేజ్ ను పుష్పా 2 నిర్మిత నవీన్ తో కలిసి సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు... 

ఈ యాక్సిడెంట్ ఇష్యుని ఇకపై రాజకీయం చేయవద్దని, సినిమా హీరోల ఇండ్ల పై దాడులు చేయకూడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.. ఈ సందర్భంగా పుష్పా 2 నిర్మాత 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ కు శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అందజేశారు.. బాబు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు..

సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లడం లేదని, అవన్నీ పుకార్లు, ఎవరు నమ్మొద్దని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.. ఎవరిపైన దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు..

Read Entire Article