రుక్మిణీ వసంత్ చాన్నాళ్లు గుర్తుంటుంది

2 months ago 3
ARTICLE AD

కాంతార సినిమా హిట్ అవ్వాలని ఓ వర్గం ఆడియన్స్ కోరుకుంటే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మరో వర్గం ఆడియన్స్ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకున్నారు. కారణం హీరోయిన్స్ రుక్మిణి. తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు.. కాంతార చిత్రాన్ని మోశారు. సినిమా దసరా స్పెషల్ గా విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. 

ఈ చిత్రంలో కాంతార 1 కథను మలుపు తిప్పే పాత్రల్లో రుక్మిణీ వసంత్ కీలకంగా ఉంది. ఆమె లుక్స్, యాక్టింగ్ అన్ని ప్రేక్షకులను అలరించాయి. కనకావతి పాత్రల్లో రుక్మిణీ వసంత్ మహారాణి లా అద్భుతః అనిపించింది. కేవలం అందానికి, గ్లామర్ కు పరిమితమయ్యే పాత్రలా కాకుండా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో సైతం ఆమె పెరఫార్మెన్స్ ఆడియన్స్ ను కట్టిపడేసింది. 

కాంతార చాప్ట‌ర్ 1 రిష‌బ్ శెట్టి న‌ట‌న గురించి, క్లైమాక్స్ గురించీ, ఆ విజువ‌ల్స్ గురించి అందరూ గొప్ప‌గా మాట్లాడుకొంటున్నారు. దాంతో పాటు రుక్మిణి వ‌సంత్ కూ మంచి మార్కులు ప‌డ్డాయి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.

సో ప్రస్తుతం యష్ టాక్సిక్, ఎన్టీఆర్ డ్రాగన్.. కాంతారా చాప్టర్ 1 హిట్ తర్వాత రుక్మిణి వసంత్ కు మరిన్ని అవకాశాలు రావడమే కాదు ఛానళ్లు ఈపేరు మార్మోగడం ఖాయమే. 

Read Entire Article