రాశి ని భలే మోసం చేసావ్ హరీష్

2 months ago 8
ARTICLE AD

రాశి ఖన్నా పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ వచ్చింది అనే సంతోషంలో ఉస్తాద్ భగత్ సింగ్ కథ కూడా వినకుండా సెట్ లోకి ఎంటర్ అయిన విషయాన్ని తనే ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లోను, ప్రమోషన్స్ లోను చెప్పింది. అదే విషయాన్నీ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పి రాశి ఖన్నా కు థాంక్స్ కూడా చెప్పాడు. 

రాశి ఖన్నా అలా చెప్పడం చూసి అందరూ షాకయ్యారు కానీ.. ఉస్తాద్ భగత్ సింగ్ చూసినవాళ్లు మాత్రం అవును రాశి ఖన్నా అసలు కథ వినకుండానే ఉస్తాద్ చేసింది. ఎందుకంటే ఆమె కేరెక్టర్ చూసి, ఆమె గ్లామర్ షో చూస్తే అది నిజమని అర్ధమవుతుంది అంటారు. హరీష్ శంకర్ మాత్రం రాశి ఖన్నా కు కథ చెప్పకుండానే భలే మోసం చేసాడు.

ఆమె నిజంగా ఉస్తాద్ భగత్ సింగ్ కథ విని ఉంటె గనక పవన్ కళ్యాణ్ అయినా రాశి ఖన్నా సినిమా ఒప్పుకునేది కాదు అంటూ మాట్లాడుకుంటున్నారు. మరోపక్క రాశి ఖన్నా కేరెక్టర్ తో ఆ రేంజ్ గ్లామర్ షో చేయించడం అవసరమా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

Read Entire Article