రామ గ్లింప్స్-ట్రెండ్ అవుతున్న ఆదిపురుష్

1 week ago 2
ARTICLE AD

బాలీవుడ్ లో నితీష్ తివారి ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. నేడు ఏప్రిల్ 2 హనుమజ్జయంతి సందర్భంగా ఉదయం పది గంటలకు రామాయణ నుంచి రాముడిగా రణబీర్ కపూర్ ని పరిచయం చేసారు మేకర్స్. రామాగా రణబీర్ కపూర్ లుక్స్ మాత్రమే కాదు విజువల్ ఎఫెక్ట్స్ అన్ని సూపర్బ్ అనేలా ఈ గ్లింప్స్ ని ఆవిష్కరించారు.

రామాయణ నుంచి రామ గ్లింప్స్ వచ్చాక సోషల్ మీడియా మొత్తం రణబీర్ కపూర్ రాముడి పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. రామాయణ ఒక విజువల్ వండర్ అంటూ కొనియాడుతున్నారు. రామాయణ నుంచి వచ్చిన రామ గ్లింప్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఉడికిపోతున్నారు.

మరోసారి ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ని ఏసుకోవడమే కాదు.. ఆదిపురుష్ టీజర్ చూసాక దాని రెస్పాన్స్ విన్నాక ప్రభాస్.. ఓం కమ్ టు మై రూమ్ అంటూ రౌత్ ని పిలిచిన వీడియో ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్స్ దగ్గర నుంచి  అన్నింటిపై తీవ్ర విమర్శలు రావడం ప్రభాస్ ఫ్యాన్స్ కి అవమానంగా మారింది.

ఇప్పుడు రామాయణ గ్లింప్స్ తో మరోమారు ఆదిపురుష్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

Read Entire Article