రాజ‌మౌళికి పోటీగా ఆ న‌లుగురు

3 weeks ago 2
ARTICLE AD

 

 

ప్రస్తుతం టాలీవుడ్‌లో రాజమౌళి సృష్టించిన పాన్-ఇండియా సామ్రాజ్యానికి సవాల్ విసరగల సత్తా ఉన్న దర్శకుల్లో నాగ్ అశ్విన్ , ప్రశాంత్ నీల్ మొదటి వరుసలో కనిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ `కల్కి 2898 AD` చిత్రంతో భారతీయ పురాణాలను సైన్స్ ఫిక్షన్‌కు జోడించి, అంతర్జాతీయ స్థాయి విజువల్ వండర్‌ను ఆవిష్కరించి జక్కన్నకు గట్టి పోటీ ఇచ్చారు.

ఆయన మేకింగ్ స్టైల్ , భారీ కథలను డీల్ చేసే విధానం భవిష్యత్తులో రాజమౌళి రికార్డులకు ప్రధాన ముప్పుగా మారే అవకాశం ఉంది.అలాగే ప్రశాంత్ నీల్  `కేజీఎఫ్`, `సలార్` చిత్రాలతో సృష్టించిన డార్క్ అండ్ రస్టిక్ వరల్డ్, మాస్ ప్రేక్షకుల్లో రాజమౌళి చిత్రాలకు సమానమైన హైప్‌ను క్రియేట్ చేస్తోంది. మరోవైపు సుకుమార్ , సందీప్ రెడ్డి వంగా కూడా ఈ రేసులో కీలకంగా మారుతున్నారు.

సుకుమార్  `పుష్ప` సిరీస్‌తో ప్రాంతీయ కథను అంత‌ర్జాతీయ‌ స్థాయికి తీసుకెళ్లగా, సందీప్ వంగా `యానిమల్` వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన రా అండ్ బోల్డ్ బ్రాండ్‌ను సృష్టించుకున్నారు. వీరిద్దరూ కేవలం విజువల్స్ మీదనే కాకుండా బలమైన క్యారెక్టరైజేషన్లు ,ఎమోషన్ల మీద పట్టు కలిగిన ద‌ర్శ‌కులు. దీంతో రాజమౌళి తర్వాత టాలీవుడ్ నుంచి గ్లోబల్ మార్కెట్‌ను శాసించే దర్శకులుగా నిలుస్తారని విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు.

Read Entire Article