TVS Orbite Price, Down Payment, Loan and EMI Details: టీవీఎస్ మోటార్ కంపెనీ.. ఇండియన్ ఈవీ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ TVS Orbiter ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అధునాతన రైడింగ్ టెక్నాలజీ, మైండ్ బ్లోయింగ్ డిజైన్ & బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ కారణాల వల్ల ఈ స్కూటర్ డిజిటల్ యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో దీని లభ్యత, తాజా ఎక్స్-షోరూమ్ ధర, ఆన్-రోడ్ ధర, కనీస డౌన్‌పేమెంట్ & బ్యాంక్ ఫైనాన్స్ వివరాలను ఇక్కడ సులభంగా తెలుసుకుందాం.

అత్యాధునిక ఫీచర్లు & కనెక్టివిటీ
ఈ కొత్త టీవీఎస్ ఆర్బిటర్ ఇ-స్కూటర్ లో 3.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌ పై 158 km రేంజ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్, సైడ్ స్టాండ్ సెన్సార్ & LED లైటింగ్ సెటప్ వంటి నయా జెన్ ఫీచర్లు ఇచ్చారు. డైలీ ఆఫీస్ కమ్యూట్ & సిటీ డ్రైవింగ్ కోసం ఇది పర్ఫెక్ట్ ఎంపికగా నిలుస్తుంది.

హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్ & ఆన్-రోడ్ ధర
హైదరాబాద్ నగరంలో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్‌ వేరియంట్‌ V1 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1,03,650. దీనికి ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఫీజులు కలిపిన తర్వాత హైదరాబాద్‌లో తాజా ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1,09,339 వరకు అవుతుంది.

విజయవాడలో ఎక్స్-షోరూమ్ & ఆన్-రోడ్ ధర
విజయవాడలో టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎక్స్-షోరూమ్ ధర కూడా రూ. 1,03,650. ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఫీజులు కలిపిన తర్వాత ఈ నగరంలో తాజా ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1,06,689 వరకు ఉంటుంది.

కనీస డౌన్‌పేమెంట్ & బ్యాంక్ వడ్డీ రేట్లు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవడానికి బ్యాంక్‌లు & ఫైనాన్స్ కంపెనీలు లోన్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. ముందుగా, ఈ టూవీలర్‌ ఆన్-రోడ్ ధరలో 10 శాతం వరకు కనీస డౌన్‌పేమెంట్‌ చేయాలి. విజయవాడలో మీరు ఈ బండిని కొనాలంటే, కనీసం రూ.11,000 డౌన్‌పేమెంట్ చెల్లించాలి. ప్రస్తుతం వివిధ ప్రముఖ బ్యాంక్‌లు ఈవీ లోన్ల పై వార్షికంగా 8.50% నుండి 14% రేంజ్‌లో వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయి.

ఉదాహరణకు.. 10% వార్షిక వడ్డీ రేటుతో 3, 4, 5 ఏళ్ల EMI వివరాలు

టీవీఎస్ ఆర్బిటర్‌ V1 వెర్షన్‌ను మీరు రూ.11,000 డౌన్‌పేమెంట్ చెల్లించి, మిగిలిన రూ.95,689 మొత్తాన్ని 10% వార్షిక వడ్డీకి రుణంగా తీసుకుంటే, వివిధ కాలపరిమితులకు EMI లెక్కలు ఇవీ:

3 ఏళ్ల కాలపరిమితి (36 నెలలు) EMI: నెలకు రూ. 3,455
4 ఏళ్ల కాలపరిమితి (48 నెలలు) EMI: నెలకు రూ. 2,791
5 ఏళ్ల కాలపరిమితి (60 నెలలు) EMI: నెలకు రూ. 2,392

ఇది కూడా చదవండి: ఆఫీస్‌ లేదా కాలేజీకి వెళ్లడానికి రూ.లక్ష లోపు వచ్చే TVS టూవీలర్లు.. ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి!

ఇదే బండిని మీరు రూ.25,000 డౌన్‌పేమెంట్ చెల్లించి, మిగిలిన రూ.81,689 మొత్తాన్ని 10% వార్షిక వడ్డీకి రుణంగా తీసుకుంటే, వివిధ కాలపరిమితులకు EMI లెక్కలు:

3 ఏళ్ల కాలపరిమితి (36 నెలలు) EMI: నెలకు రూ. 2,950
4 ఏళ్ల కాలపరిమితి (48 నెలలు) EMI: నెలకు రూ. 2,383
5 ఏళ్ల కాలపరిమితి (60 నెలలు) EMI: నెలకు రూ. 2,042

గమనిక: కొనుగోలుదారుల సిబిల్ స్కోర్ & బ్యాంక్ నిబంధనలను బట్టి ఈ EMI మొత్తంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ టూ వీలర్ లోన్ తీసుకునేటప్పుడు వివిధ బ్యాంక్‌లు ఆఫర్ చేసే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపులు & జీరో ప్రిపేమెంట్ పెనాల్టీ ఆప్షన్లను పోల్చి చూసుకోవడం శ్రేయస్కరం. సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లిస్తే మీ జేబుపై వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: రూ.3.60 లక్షల స్పాట్‌ క్యాష్‌తో Mahindra XUV 7XO మీదే! ఈజీ EMI ప్లాన్‌ ఎంచుకుంటే చాలు

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.